ఆధ్యాత్మికం

Deepam : ఇంట్లో రోజూ దీపం పెట్టేటప్పుడు.. ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవి..!

Deepam : ప్రతి రోజు కూడా ప్రతి ఇంట దీపం వెలగాలి. దీపం ఇంట్లో వెలగకపోతే ఆ ఇంటికి అసలు మంచిది కాదు. అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే దీపారాధన చేస్తూ ఉంటారు. నిజానికి దీపాన్ని కూడా పూజించడం చాలా ముఖ్యం. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అందుకే మనం జీవించి ఉన్నాం. మనం దీపం వెలిగిస్తే అక్కడికి దేవతలు వస్తారు.

దీపారాధన చేసేటప్పుడు కూడా కచ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. మరి దీపం పెట్టేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేసి మళ్లీ దీపం వెలిగించాలి. ఒకవేళ సాయంత్రం పూట స్నానం చేయలేని స్థితిలో ఉంటే కనీసం ముఖం, కాళ్లు, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేస్తే మంచిది.

rules to follow when lighting deepam daily

దీపారాధన చేయడానికి ప్రతిరోజూ తలస్నానం చేయక్కర్లేదు. మామూలు స్నానం చేస్తే చాలు. ఎప్పుడూ కూడా స్త్రీలు ఇనుప ప్రమిదలో దీపం పెట్టకూడదు. బంగారం, వెండి లేదంటే మట్టి వాటిలోనైనా దీపం పెట్టొచ్చు. దీపపు ప్రమిదని ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు. అప్పుడు దీపాన్ని అగౌరపరిచినట్లు అవుతుంది. దీపం పెట్టడానికి ముందు కచ్చితంగా ఇల్లు శుభ్రపరచాలి. అప్పుడే దీపాన్ని పెట్టాలి.

దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి, కొంచెం పసుపు, కుంకమ చల్లి అప్పుడు దీపం ప్రమిద పెట్టి దీపాన్ని వెలిగించాలి. ఇవన్నీ రోజూ ఉదయం అవ్వవు కదా అనుకుంటే రోజు మీరు మామూలుగా పెట్టేసి పండగ రోజు సెలవు రోజుల్లో ఈ విధంగా పాటిస్తే మంచిది. దీపారాధనకి ఆవు నెయ్యిని ఉపయోగిస్తే మంచిది. లేదంటే నువ్వుల నూనె కూడా వాడొచ్చు. కొబ్బరి నూనెతో అయినా దీపం పెట్టొచ్చు. రెండు పూట్ల దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుష్టశక్తులు పోతాయి. నిత్యం దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి. ఇంట్లో శాంతి ఉంటుంది.

Admin

Recent Posts