lifestyle

Eye Twitching : స్త్రీల‌కు ఎడమకన్ను, పురుషుల‌కు కుడికన్ను అదిరితే మంచిదా.. దాని వెనుక ఉన్న కథ ఏంటి..? కళ్లు అదరడానికి కారణాలు తెలుసుకోండి..

Eye Twitching : ఆడవారికి ఎడమకన్ను అదిరితే మంచిదని.. మగవారికి కుడి కన్ను అదిరితే మంచిది అని అనడం మనం వింటుంటాం. మనకి వాస్తు శాస్త్రం లాగే శకున శాస్త్రం కూడా ఉంది. దాని ప్రకారం మన కన్నే కాదు మగవారికి కుడివైపు శరీర భాగం, ఆడవారికి ఎడమ వైపు శరీర భాగం అదిరితే మంచిదంటారు. దీనివెనుక రామాయణానికి సంబంధించి ఒక కథ చెబుతారు. శ్రీరామచంద్రుడు వానర సేనని తీసుకుని రావణుడి మీద యుద్ధానికి బయల్దేరినప్పుడు రావణాసురుడికి, సీతమ్మవారికి ఎడమ కన్ను అదిరాయట. సీతమ్మవారికి ఎడమ కన్ను అదిరిన ఫలితం కనిపించింది. రాముడు సీతను రావణాసురుడి చెరనుంచి విడిపించాడు. అలాగే రావణాసురుడుకి కీడు జరిగింది.

ప్రతిసారి శరీర భాగాలదిరినప్పుడు మనకి అనుకూలమైన సూచన అయితే ఏదో మంచి జరుగుతుందని.. కానప్పుడు ఏదో కీడు జరుగుతుందని అనుకోవడానికి లేదు. కేవలం కొన్ని సార్లు మాత్రమే అదిరితే అది శకునం కావచ్చు. కొందరు ఉదయం నుండీ రాత్రి దాకా అదిరిందంటారు. కొందరికి శరీర భాగాలు తరచూ అదరవచ్చు. అది నరాల బలహీనతకు సూచన.

eye twitching what is the meaning behind it

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వాత, పిత్త గుణాలు ప్రకోపించినప్పుడు శరీరంలో భాగాలు అదురుతాయంటారు. కళ్ళ వ్యాధులున్నా కూడా కంటి భాగాలు తరచూ అదరవచ్చు. అలాంటప్పుడు డాక్టరుని సంప్రదించాలి. అయితే ఎలాంటి రోగాలు లేకుండా అంతా బాగానే ఉన్న‌ప్పుడు ఇలా శ‌రీర భాగాలు అదిరితే మాత్రం త‌ప్ప‌క శ‌కున శాస్త్రం వ‌ర్తిస్తుంద‌ని చెబుతున్నారు. క‌నుక ఇక‌పై ఇలా జ‌రిగితే అందుకు త‌గిన విధంగా స్పందించండి.

Admin

Recent Posts