information

మీ వంట గ్యాస్ సిలిండ‌ర్ లో గ్యాస్ ఎంత ఉందో ఈ సింపుల్ ట్రిక్‌తో తెలుసుకోండి..!

వంట గ్యాస్ సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో సాధార‌ణంగా ఎవ‌రికీ తెలియ‌దు. అందుక‌ని చాలా మంది రెండు సిలిండ‌ర్ల‌ను పెట్టుకుంటారు. ఒక‌టి అయిపోగానే ఇంకొక‌టి వాడ‌వ‌చ్చ‌ని చెప్పి చాలా మంది డ‌బుల్ సిలిండర్ల‌ను వాడుతుంటారు. అయితే సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎంత ఉందో కింద ఇచ్చిన సుల‌భ‌మైన ట్రిక్ ద్వారా ఇట్టే తెలుసుకోవ‌చ్చు. మ‌రి ఆ ట్రిక్ ఏమిటంటే..

ఒక వ‌స్త్రాన్ని బాగా త‌డిపి గ్యాస్ సిలిండ‌ర్ చుట్టూ చుట్టాలి. పూర్తిగా క‌ప్పేలా వ‌స్త్రాన్ని చుట్టాలి. 2 నిమిషాల పాటు ఉంచి తీసేయాలి. దీంతో సిలిండ‌ర్ మొత్తం పైన త‌డిగా ఉంటుంది.

know how much gas is left in lpg cylinder in these ways

అయితే కొంత సేపు ఆగాక చూస్తే సిలిండ‌ర్‌పై కొంత భాగం పొడిగా మారుతుంది. త‌డి మొత్తం పోతుంది. సిలిండ‌ర్ లో గ్యాస్ లేని భాగం మొత్తం వేడిగా ఉంటుంది. అందుకే బ‌య‌టి వైపు త‌డి త్వ‌ర‌గా ఆరిపోతుంది. సిలిండ‌ర్‌లో గ్యాస్ ఉన్న భాగంలో కొంచెం చ‌ల్ల‌గా ఉంటుంది. అందుక‌నే బ‌య‌టి వైపు సిలిండర్‌పై త‌డి త్వ‌ర‌గా ఆర‌దు. దీంతో త‌డి భాగం ఎక్క‌డి వ‌ర‌కు ఉందో గ‌మ‌నిస్తే చాలు.. అంత వ‌ర‌కు సిలిండ‌ర్‌లో గ్యాస్ ఉన్న‌ట్లు లెక్క‌. ఇలా సిలిండ‌ర్‌లో గ్యాస్ ప‌రిమాణాన్ని తెలుసుకోవ‌చ్చు.

అయితే గ్యాస్ అయిపోతుంటే మంట నీలి రంగులో కాక ప‌సుపు రంగులో క‌నిపిస్తుంది. ఇలా కూడా గ్యాస్ అయిపోతుంద‌ని తెలుసుకోవ‌చ్చు. కానీ స్ట‌వ్ బ‌ర్న‌ర్ స‌రిగ్గా లేక‌పోయినా మంట నీలి రంగులో రాదు, క‌నుక ముందు బ‌ర్న‌ర్‌ను శుభ్రం చేయాలి. త‌రువాత కూడా మంట ప‌సుపు రంగులోనే వ‌స్తుంటే అప్పుడు నిజంగానే గ్యాస్ అయిపోతున్న‌ట్లు గుర్తించాలి. ఇక కొంద‌రు సిలిండ‌ర్‌ను పైకి ఎత్త‌డం ద్వారా కూడా అందులో గ్యాస్ ఎందో కొలుస్తారు. కానీ దీని ద్వారా స‌రిగ్గా తెలియ‌దు. ప్రాక్టీస్ ఉండాలి. అన్నింటిలోకి పైన తెలిపిన చిట్కానే ఉత్త‌మం. దాంతో సిలిండ‌ర్‌లో గ్యాస్ ఎంత ఉందో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు.

Admin

Recent Posts