lifestyle

అంతా న‌కిలీ.. మొన్న చైనా ప్లాస్టిక్ బియ్యం ఇప్పుడు నకిలీ బంగాళదుంపలు..

ఇటీవ‌ల ఎక్క‌డ చూసిన కూడా న‌కిలీ రాజ్యం న‌డుస్తుంది. అడ్డంగా డ‌బ్బులు సంపాదించే క్ర‌మంలో న‌కిలీ వ‌స్తువుల‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటున్నారు. మొన్నామ‌ధ్య చైనా ప్లాస్టిక్ బియ్యం ఎంత వ‌ణికించిందో మ‌నం చూశాం. ఇప్పుడు న‌కిలీ బంగాళ‌దుంప‌లు కూడా మార్కెట్‌లో క‌నిపిస్తున్నాయి.లాభాపేక్ష కోసం కొందరు వ్యాపారులు నకిలీ బంగాళాదుంపలకి రసాయనాల రంగులు వేసి విక్రయిస్తున్నారు, ఇది మన ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. ఇటీవల, ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఎస్‌డిఎ) బల్లియాలో భారీ ఆపరేషన్‌లో 21 క్వింటాళ్ల నకిలీ బంగాళాదుంపలను స్వాధీనం చేసుకుంది.ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో ఇటీవల జరిగిన ఫుడ్‌ సేఫ్టీ అధికారుల రైడింగ్‌లో పెద్ద సంఖ్యలో నకిలీ బంగాళాదుంపలు బయటపడ్డాయి. వాడిపోయిన బంగాళాదుంపలు తాజాగా కనిపించడం కోసం వ్యాపారులు వాటికి కెమికల్స్‌ పూస్తున్నారు

నకిలీ ఆలుగ‌డ్డ‌ల‌ని ఎలా గుర్తించాలి అంటే, నిజమైన ఆలుగడ్డలు సహజమైన మట్టి వాసన కలిగి ఉంటాయి. అందుకు విరుద్ధంగా నకిలీ ఆలుగడ్డలు కృత్రిమమైన రసాయనాల వాసన కలిగి ఉంటాయి. ఆలుగడ్డను కత్తిరించి చూడాలి. నకిలీ ఆలుగడ్డ అయితే లోపల, బయట వేర్వేరు రంగులో కనిపిస్తుంది. స్వచ్ఛమైన ఆలుగడ్డ రంగు లోపల, బయట ఒకేలా ఉంటుంది. ఆలుగడ్డలను నీటిలో వేయడం ద్వారా కూడా ఏది నకిలీనో, ఏది స్వచ్ఛమైనదో గుర్తించవచ్చు. నకిలీ ఆలుగడ్డలు రసాయనాల కారణంగా నీళ్లలో తేలుతూ ఉంటాయి. కానీ స్వచ్ఛమైన, తాజా ఆలుగడ్డలు నీళ్లలో మునిగిపోతాయి. నకిలీ బంగాళాదుంపలపై ఉన్న పూత మట్టి నీళ్లలో వేయగానే సులువుగా కరిగిపోతోంది. కానీ స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే సహజమైన మట్టి అంత సులువుగా పోదు. అదిపోవాలంటే గట్టిగా రుద్ది కడగాల్సి వస్తుంది.

fake potatoes circulating in the market beware of them

ఆలుగడ్డలను కడిగేటప్పుడు స్వచ్ఛమైన ఆలుగడ్డలపై ఉండే పొట్టు సులువుగా ఊడిపోతుంది. కానీ నకిలీ ఆలుగడ్డలపై ఉండే పొట్టు వాడిపోవడంవల్ల అంత సులువుగా ఊడదు. రసాయనాలతో త‌యారు చేసిన‌ బంగాళదుంపలలో కాల్షియం కార్బైడ్ ఉపయోగించబడుతుంది, ఇందులో ఆర్సెనిక్ మరియు ఫాస్పరస్ ఉంటాయి. ఈ రసాయనం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం మరియు వాంతులు, విరేచనాలు, కడుపు చికాకు మరియు అధిక దాహం వంటి సమస్యలను కలిగిస్తుంది. అంతే కాదు, ఆర్సెనిక్ శరీరంలో ఎక్కువ కాలం ఉంటే క్యాన్సర్‌కు కూడా కారణం అవుతుంది. అందుకే ఏ ఆహార ఉత్ప‌త్తుల‌ని అయిన కొనుగోలు చేసేముందు పలు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం మంచిది.

Sam

Recent Posts