vastu

Rules For Wealth : ఈ 5 నియ‌మాల‌ను పాటిస్తే చాలు.. డ‌బ్బుల వ‌ర్షం కురుస్తుంది..!

Rules For Wealth : ఆర్థిక బాధలు ఏమీ లేకుండా హాయిగా, సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు. కానీ కొంత మందికి ఆర్థిక బాధ్యతలు తప్పవు. అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక బాధ్యతలతో ఇబ్బంది పడేవాళ్లు కచ్చితంగా ఈ సూత్రాలని పాటించాలి. ఇలా కనుక పాటించారంటే ధనలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎక్కడికీ వెళ్ళిపోదు. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఇంటి ముఖద్వారం అందంగా కనపడితే, మనకి కూడా ఆ ఇంటి లోపలకి వెళ్లాలని అనిపిస్తుంది. అలానే లక్ష్మీ దేవికి కూడా అందంగా కనపడాలి.

ఇంటి ముఖద్వారాన్ని అందంగా, కలర్ ఫుల్ గా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఇంట్లో జలపాతం వంటి ప్రవాహం ఉండాలి. చిన్నదైనా సరే ఫ‌రవాలేదు. దీని కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయక్కర్లేదు. చిన్న చిన్నవి కూడా దొరుకుతూ ఉంటాయి. అటువంటివి ఇంట్లో పెట్టడం వలన నీరు ఎలా అయితే ఫ్లో అవుతుందో, డబ్బు కూడా అలానే ప్రవహిస్తుంది.

follow these 5 rules for wealth

ఇంట్లో కానీ ఆఫీస్ లో కానీ అవసరం లేని చెత్తాచెదారాన్ని తొలగించాలి. అప్పుడే ఇంట్లో ధనలక్ష్మి ఉంటుంది. రంగు రంగుల స్పటికం రాళ్లని ఇంట్లో ఉంచుకుంటే, డబ్బు ఇంట్లోకి వస్తుంది. అలానే మీ ఇంట లక్ష్మీదేవి ఉండాలంటే వంటగది ఎప్పుడూ కూడా శుభ్రంగా, అందంగా ఉండాలి. డబ్బుకి, వంట గదికి కూడా లింక్ ఉంటుంది. వంట గదిలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ వంటింట్లో ఎన‌ర్జీనే ఇంట్లోకి డబ్బు వచ్చేటట్టు చేస్తుంది. కాబట్టి వంట గదిని ఎప్పుడూ కూడా శుభ్రపరచుకోవాలి. అందంగా వంటగదిని ఉంచుకోవాలి. వంట గదిలో గోడలు, షెల్ఫులు ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కనుక మీరు వీటిని పాటించారంటే కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట ఉంటుంది.

Admin

Recent Posts