vastu

ఇంట్లో ప్రతికూల వాతావరణం తొలగిపోవాలంటే ఇలా చేయాల్సిందే.!

ఎంతో ప్రశాంతమైన కుటుంబంలో ఉన్నపళంగా అనేక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడే లోగా మరొక సమస్య వచ్చి చేరి కుటుంబ సభ్యులందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఈ విధంగా మన ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడినప్పుడు అనేక సమస్యలు మనల్ని చుట్టుముట్టి తీవ్ర మనోవేదనకు కారణమవుతాయి. ఇలాంటి సమయంలోనే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, మనస్పర్ధలు కూడా తలెత్తుతాయి. ఇంట్లో ఏర్పడిన ఈ ప్రతికూల వాతావరణాన్ని ఎలా పోగొట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేసే సమయంలో కాస్త ఉప్పు నీటిలో వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేయటం వల్ల మన ఇంట్లో ఏర్పడిన ప్రతికూల వాతావరణం తొలగిపోయి కుటుంబ సభ్యులందరూ ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు. అదేవిధంగా ఉదయం, మధ్యాహ్నం మన ఇంట్లో ఉన్న కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇంటిలోకి స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణాన్ని తొలగిస్తుంది.

follow these tips to remove negative energy in home

సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు మన ఇంట్లో పడే విధంగా ఇంటి తలుపులు, కిటికీలు తీసి ఉంచాలి. అదే విధంగా మన ఇంట్లో మంత్రాలు, పూజలు చేసే సమయంలో గంటను మ్రోగించాలి. మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఈ విధమైన పద్ధతులను పాటించడం ద్వారా ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల తొలగిపోయి అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.

Admin

Recent Posts