Free Fire Game : చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్ పలు చైనా యాప్‌లను నిషేధించిన విషయం విదితమే. అందులో భాగంగానే పబ్‌జి గేమ్‌ను కూడా నిషేధించారు. దీంతో ఆ గేమ్ నిషేధం అనంతరం గరెనా సంస్థ తన ఫ్రీ ఫైర్ గేమ్‌తో బాగా పాపులర్ అయింది. అచ్చం పబ్‌జి ని పోలి ఉండే ఈ గేమ్‌కు భారత్‌లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ గేమ్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాపిల్ యాప్ స్టోర్‌లోనూ కనిపించడం లేదు. ఈ గేమ్‌ను నిషేధించినట్లు వార్తలు వస్తున్నాయి.
పబ్‌జి డెవలపర్ సంస్థ క్రాఫ్టన్ ఇటీవలే గరెనా సంస్థపై లా సూట్ వేసింది. పబ్‌జి గేమ్‌లో ఉన్న చాలా వరకు అంశాలను గరెనా కాపీ కొట్టి తన ఫ్రీ ఫైర్ గేమ్‌ను డెవలప్ చేసిందని.. కనుక గరెనా సంస్థకు చెందిన ఫ్రీ ఫైర్ యాప్‌ను నిషేధించాలని కోరుతూ క్రాఫ్టన్ లా సూట్ వేసింది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌తోపాటు యాపిల్ యాప్ స్టోర్‌లోనూ ఫ్రీ ఫైర్ గేమ్ కనిపించడం లేదు. దీంతో గూగుల్, యాపిల్‌లు ఈగేమ్‌ను నిషేధించాయని తెలుస్తోంది.
కాగా భారత్‌లో పబ్‌జి నిషేధం అనంతరం దాన్ని పోలిన అనేక యాప్స్ పుట్టుకొచ్చాయి. అయితే అప్పటికే ఫ్రీ ఫైర్ గేమ్ అందుబాటులో ఉంది. దీంతో పబ్‌జి నిషేధించబడ్డాక ఫ్రీ ఫైర్ గేమ్ కు పాపులారిటీ పెరిగింది. ఫ్రీ ఫైర్ గేమ్ ద్వారా గరెనా సంస్థకు 2021లో 414 మిలియన్ డాలర్ల ఆదాయం రాగా.. పబ్‌జి గేమ్ ద్వారా క్రాఫ్టన్‌కు 639 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. ఈ క్రమంలోనే పబ్‌జి గేమ్‌లోని పలు అంశాలను కాపీ చేసిన గరెనా తన ఫ్రీ ఫైర్ గేమ్‌లో వాటిని అందించిందని క్రాఫ్టన్ ఆరోపిస్తూ లా సూట్ వేసింది. అయితే ఈ విషయంపై గూగుల్, యాపిల్ సంస్థలతోపాటు గరెనా సంస్థ కూడా స్పందించాల్సి ఉంది.