French Fries : రెస్టారెంట్ల‌లో ల‌భించే ఫ్రెంచ్ ఫ్రైస్‌.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

French Fries : బంగాళాదుంప‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్లల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఒక‌టి. ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా, చాలారుచిగా ఉంటాయి. పిల్ల‌లు వీటిని ఇష్టంగా తింటారు. మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఇవి ల‌భిస్తాయి. అయితే బ‌య‌ట తినే ప‌ని లేకుండా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ను అదే రుచితో అంతే క్రిస్పీగా మనం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారుచేయ‌డం చాలా సుల‌భం. కొన్నిచిట్కాల‌ను పాటిస్తూ కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల రుచిక‌ర‌మైన ఫ్రెంచ్ ఫ్రైస్ ను మ‌నం ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇన్ స్టాంట్ గా బంగాళాదుంప‌ల‌తో ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ ఫ్రైంచ్ ఫ్రైస్ ను ఇన్ స్టాంట్ గా ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రెంచ్ ఫ్రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పొడ‌వుగా ఉండే బంగాళాదుంప‌లు – 3( స్టార్చ్ త‌క్కువ‌గా ఉండేవి), ఉప్పు – 2 టీ స్పూన్స్, నూనె – డీప్ ప్రైకు స‌రిప‌డా.

French Fries recipe make them like in restaurants
French Fries

ఫ్రెంచ్ ఫ్రైస్ త‌యారీ విధానం..

ముందుగా బంగాళాదుంప‌ల‌పై ఉండే చెక్కును తీసివేయాలి. త‌రువాత వీటిని మరీ సన్న‌గా, మ‌రీ లావుగా కాకుండా నిలువుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత వీటిని నీటిలో వేసి 2 నుండి 3 సార్లు బాగా క‌డ‌గాలి. త‌రువాత ఒక గిన్నెలో చ‌ల్ల‌టి నీటిని తీసుకుని అందులో ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత క‌ట్ చేసిన బంగాళాదుంప ముక్క‌ల‌ను నీటిలో వేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత వీటిని గిన్నెతో స‌హా డీప్ ప్రిజ్ లో 10 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌ల‌ను బ‌య‌ట‌కు తీసి వ‌స్త్రంపై వేసి త‌డి పోయే వ‌ర‌కు ఆర‌బెట్టాలి. త‌రువాత క‌ళాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి 2 నిమిషాల పాటు వేయించాలి.

త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవి చ‌ల్లారిన త‌రువాత ఈ ప్లేట్ ను మ‌రో 10 నిమిషాల పాటు డీప్ ప్రిజ్ లో ఉంచాలి. త‌రువాత మ‌ర‌లా నూనెను బాగా వేడి చేయాలి. త‌రువాత ఫ్రిజ్ లో ఉంచిన బంగాళాదుంప ముక్క‌ల‌ను నూనెలో వేసి వేయించాలి. వీటిని క్రిస్పీగా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా,క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ త‌యార‌వుతాయి. ఇలా ఇంట్లోనే చాలా సుల‌భంగా క్రిస్పీగా ఉండే ప్రెంచ్ ఫ్రైస్ ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts