మహారాష్ట్రలో దురదృష్టవశాత్తు ఓ సంఘటన చోటు చేసుకుంది. నటుడు అశోక్ మాలి గార్బా కింగ్ గా పూణే లో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆయన గుండెపోటుతో మరణించడం విషాదకరం. రిపోర్టుల ప్రకారం అశోక్ మాలి గుండె పోటు కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. గార్భా సమయంలో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అశోక్ మాలి గార్బా చేస్తున్న సమయంలో కుప్పకూలిపోయారు. వీడియోలో మనం నెమ్మదిగా ఆయన కుప్పకూలిపోవడాన్ని చూడొచ్చు. పూణేలో నవరాత్రి పండుగని అద్భుతంగా జరుపుతారు.
ఆ సమయంలో గార్బాలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోవడం బాధాకరం. సమీపంలో ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆయనకి సంబంధించిన ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.