వినోదం

క‌ల్కి సినిమాపై గ‌రిక‌పాటి ఆగ్ర‌హం..!

ప్ర‌భాస్, క‌మ‌ల్ హాసన్, అమితాబ్ బచ్చ‌న్, దీపికా ప‌దుకొణే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి. ఈ మూవీ విడుద‌లై ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే ఈ సినిమాపై తాజాగా ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సినిమాలో కర్ణుడు, అశ్వత్థామ పాత్రలను తప్పుగా చూపించారని విమర్శించారు. మహాభారతాన్ని తమకు నచ్చినట్లుగా వక్రీకరించారని మండిపడ్డారు. నందమూరి తారక రామారావు కాలం నుంచి రామాయ‌ణం, మ‌హాభార‌తాల‌ని వ‌క్రీక‌రిస్తూనే ఉన్నారు. సినిమా అంటే.. ఎంటర్టైన్ చేయాలి.. అందులో వాస్తవాలే చూపించాలన్న నియమం ఏమీ లేదు కదా?.. క్రియేటివ్ ఫ్రీడం పేరిట తమకు నచ్చిన, తెలిసిన దాన్నే తీస్తారు.. వాటిని జనాలు కూడా ఆదరిస్తుంటారు..

అందుకే మేక‌ర్స్ కూడా అలా సినిమాలు తీస్తున్నారు.”కర్ణుడు ఎవరో తెలియకపోతే ‘కల్కి’ సినిమాలో చూపించిన వాడే కర్ణుడు. మనం ఏం చేస్తాం. సినిమా వాళ్లు ఏం చూపిస్తే అది. మొత్తం భారతంలో ఉన్నది వేరు.. అందులో చూపించింది వేరు. అశ్వత్థామ, కర్ణుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు.. అర్జునుడు, భీముడు, కృష్ణుడు అందరూ విలన్లు అయిపోయారు. ఎలా అయ్యారో మాకు అర్థం కావట్లేదు. బుర్ర పాడైపోతోంది. భారతం చాలా చదివితే అర్థం అవుతుంది కర్ణుడినే అశ్వత్థామ కాపాడారు. అశ్వత్థామను కర్ణుడు ఒక్కసారి కూడా కాపాడలేదు. అశ్వత్థామకు ఆ అవసరం లేదు. ఎందుకంటే అశ్వత్థామ మహా వీరుడు. ఇక్కడేమో ‘ఆచార్య పుత్రా ఆలస్యమైనదా?’ అంటూ డైలాగ్ పెట్టారు. అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. మనకు ఏది కావాలంటే అది పెట్టేయడమే. ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ డైలాగ్స్ రాసేవాడు అలాంటివి రాసిచ్చేస్తాడు కదా” అంటూ గరికపాటి ఫైర్ అయ్యారు.

garikapati on kalki movie very angry with it

మరి మున్ముందు రెండో పార్టులో భారతాన్ని ఇంకెంత మార్చి చూపిస్తాడో చూడాలి అని అన్నారు. అయితే సినిమా రిలీజ్‌కి ముందు క‌ల్కి గురించి నాగ్ అశ్విన్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాను ఫిక్షన్ చిత్రంగా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మూడు వేరు ప్రపంచాల మధ్య కథతో తెరకెక్కించినట్లు వివరించారు. ప్రపంచంలో తొలి నగరం కాశీ… చివరి నగరం కూడా కాశీ అని ఊహించుకుని ఈ కథ రాసినట్లు చెప్పారు. కలియుగం అంతం అయ్యే సమయంలో కాశీలో ఉండే మనుషులు, వారి పరిస్థితులు, టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తారు? ఇందులో చూపించినట్లు చెప్పారు. అయితే, గరికపాటి మాత్రం సినిమా కథ గురించి కాకుండా, కేవలం భారతంలోని పాత్రలను తప్పుగా చూపించడం పైనే ఆయన అభ్యంతరం వ్య‌క్తం చేశారు.

Sam

Recent Posts