Akkalakarra : కొండ ప్రాంతాల్లో ఎక్కువ‌గా క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకోండి.. ఎందుకంటే..?

Akkalakarra : మ‌న చుట్టూ అనేక ర‌కాల ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌లు ఉంటాయి. కానీ అవి ఔష‌ధ మొక్క‌లని వాటిలో ఔష‌ధ గుణాలు ఉంటాయ‌ని వాటిని మ‌నం విరివిరిగా ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. అలాంటి కొన్ని ర‌కాల మొక్క‌లల్లో అక్క‌ల క‌ర్ర మొక్క కూడా ఒక‌టి. దీనిని సంస్కృతంలో అకార‌క‌ర‌భ‌, హిందీలో అక‌ర్ క‌రా అని పిలుస్తారు. ఈ మొక్క ప్ర‌తి భాగంలో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి ఎక్కువ‌గా మెట్ట ప్రాంతంలో, కొండల‌పై పెరుగుతాయి. ఈ మొక్క‌ను ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. అక్క‌ల క‌ర్ర వేరు కారం రుచిని అలాగే ఉష్ణ స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది. వాత‌, క‌ఫ‌, పిత సంబంధ‌మైన రోగాల్నింటిని త‌గ్గించడంలో అక్క‌ల క‌ర్ర మొక్క మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. అక్క‌ర కర్ర‌ను ఏ విధంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఏయే ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుత కాలంలో చాలా మంది వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పి, న‌డుము నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాంటి వారు అక్క‌ల క‌ర‌క‌ర వేరును ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ మొక్క వేరు పొడిని రెండు లేదా మూడు చిటికెల మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవాలి. దీనిని కొద్ది కొద్దిగా చప్ప‌రిస్తూ మింగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల నొప్పులు త‌గ్గుతాయి. న‌త్తి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు అక్క‌ల కర్ర వేరును ఉప‌యోగించ‌డం వ‌ల్ల క్ర‌మంగా న‌త్తి త‌గ్గుతుంది. ఈ వేరును నీటితో నూరి దాని నుండి గంధాన్ని తీయాలి. ఈ గంధాన్ని కొద్దిగా నాలుకపై రాసుకోవ‌డం వ‌ల్ల న‌త్తి త‌గ్గుతుంది. అలాగే అక్క‌ల‌కర్ర వేరు ముక్క‌ను దారంతో క‌ట్టి పిల్ల‌ల మెడ‌లో వేస్తే వారిలో అంటు వ్యాధులు రాకుండా ఉంటాయి. దీర్ఘ‌కాలం పాటు త‌ల‌నొప్పితో బాధ‌ప‌డే వారు అక్క‌ల క‌ర్ర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి వెంట‌నే త‌గ్గుతుంది.

Akkalakarra plant benefits in telugu must take this to home
Akkalakarra

అక్క‌ల క‌ర్ర 5 గ్రాములు, మిరియాలు 5 గ్రాములు, శొంఠి 5 గ్రాముల మోతాదులో తీసుకుని మంచి నీటితో క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించ‌డం వ‌ల్ల దీర్ఘకాలంగా వేధిస్తున్న త‌ల‌నొప్పి కూడా త‌గ్గుతుంది. అదే విధంగా దంతాల స‌మ‌స్య‌లు, గొంతు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఒక గ్లాస్ నీటిలో అక్క‌ల క‌ర్ర‌, దుంప రాష్ట్రం, శొంఠి.. ఈ మూడింటిని ఒక్కో గ్రాము మోతాదులో వేసి మ‌రిగించాలి. వీటిని ఒక క‌ప్పు క‌షాయం అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న క‌షాయాన్ని గొంతులో పుక్కిలించ‌డం వల్ల దంత స‌మ‌స్య‌లు, గొంతు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ద‌గ్గు, రొమ్ము ప‌డిశం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు రెండు చిటికెల అక్క‌ల క‌ర్ర వేరు పొడిని ఒక టీ స్పూన్ తేనెతో ఆహారానికి ఒక గంట పాటు తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు పూట‌లా తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

ఫిట్స్ , మూర్ఛ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి అక్క‌ల‌క‌ర్ర చ‌క్క‌టి ఔష‌ధంలా ప‌ని చేస్తుంది. అక్క‌లకర్ల వేర్ల పొడిని వెనిగ‌ర్ తో మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మానికి మూడు రెట్ల తేనెను క‌లిపి నిల్వ చేసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున మూడు గ్రాముల మోతాదులో నోట్లో వేసుకుని చ‌ప్ప‌రించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఫిట్స్, మూర్ఛ‌లు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా అక్క‌ల‌క‌ర్ర గ‌ర్భ‌నిరోధ‌క సాధ‌నంగా కూడా ప‌ని చేస్తుంది. అక్క‌ల‌క‌ర్ర‌ను, మిరియాల‌ను స‌మానంగా క‌లిపి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తేనెతో క‌లిపి మెత్త‌గా నూరాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని సంభోగంలో పాల్గొనే ముందు పురుషుడు త‌న అంగానికి లేప‌నంగా రాసుకుని సంభోగంలో పాల్గొనాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల సంభోగంలో పాల్గొన్న‌ప్ప‌టికి స్త్రీకి గ‌ర్భం రాకుండా ఉంటుంది. అంతేకాకుండా అక్క‌ల‌క‌ర్ర‌ను ఉప‌యోగించి మ‌నం చిలుక చేత కూడా మ‌నిషిలా మాట్లాడించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అక్క‌ల క‌ర్ర పొడిని చిలుక‌కు ఇచ్చే ఆహారంలో క‌లిపి ఇవ్వాలి. ఇలా ఇవ్వ‌డం వ‌ల్ల చిలుక మ‌న‌లాగా చ‌క్క‌గా మాట్లాడ‌గలుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా అక్క‌ల క‌ర్ర మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts