Money Plant : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా జీవించాలని అనుకుంటారు. అందుకోసం తప్పులు చేయకుండా, వాస్తు ప్రకారం పాటిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. చాలామంది, అప్పుల నుండి బయట పడాలని అనుకుంటారు. వాస్తు ప్రకారం, అప్పుల నుండి బయటపడడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇలా చేయడం వలన, ఆర్థిక బాధల నుండి బయటపడచ్చు. సంతోషంగా ఉండొచ్చు. మీరు కూడా అప్పుల బాధ నుండి బయటపడాలనుకుంటున్నారా…? అయితే, తప్పక ఇలా చేయండి.
వాస్తు ప్రకారం అప్పులు బాధల నుండి బయటపడి, సంతోషంగా ఉండాలంటే, ఇంట్లో మనీ ప్లాంట్ ని పెంచాలి. పైగా మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే, ఇల్లు చూడడానికి బాగా కనపడుతుంది. ఎంతో ఆకర్షణంగా ఉంటుంది. నిర్వహణ కూడా ఈజీ గానే ఉంటుంది. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. సంపద పెరుగుతుంది. అయితే, మనీ ప్లాంట్ ని నాటేటప్పుడు సరైన దిశలో నాటడం మంచిది. ఈశాన్యం వైపు ఎప్పుడూ కూడా ఉంచొద్దు.
ఈ దిశలో మని ప్లాంట్ ఉంటే, ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. పైగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మనీ ప్లాంట్ ని ఎప్పుడు కూడా, ఆగ్నేయం వైపు పెట్టాలి. గణేశుడికి ఈ దిశలో ఉంచితే ఇష్టమట. కాబట్టి, ఈ దిశలో మనీ ప్లాంట్ ని పెడితే మంచిది. మనీ ప్లాంట్ నేలని తాకకూడదు. మనీ ప్లాంట్ నాటిన తరవాత, త్వరగా ఎదిగిపోతుంది. ఫలితంగా మొక్క తీగలు బాగా పెరుగుతాయి. పందిరిలా అల్లేసుకుంటే సరిపోతుంది. వాస్తు ప్రకారం పెరుగుతున్న తీగలు శుభసూచకం. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి, నేలని తాకనివ్వదు. ఇలా ఈ విధంగా మీరు, మనీ ప్లాంట్ ఇంట్లో పెంచితే ఆర్థిక బాధలు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు.