ఆధ్యాత్మికం

Guggilam Dhupam : ఇంట్లో త‌ర‌చూ గుగ్గిలంతో ధూపం వేయండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Guggilam Dhupam : మనం ప్రతిరోజూ భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాము. పూజ చేస్తూ ఉంటాము. కచ్చితంగా రోజూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. ఇది నిన్నో, మొన్నో మొదలైంది కాదు. పురాతన కాలం నుండి కూడా దేవుడికి నియమాలతో పూజ చేయడం ఉంది. అయితే,పూజ చేసిన తర్వాత ధూపం వేస్తూ ఉంటాము. ఇది కూడా ఎప్పటినుండో వుంది. అగరబత్తుల సుగంధం లేకుండా పూజ ఏదీ కూడా ముగిసిపోదు. ధూపం వేయడం చాలా మంచిది. మనసుకి ప్రశాంతతని ఇస్తుంది.

ఇంటి వాతావరణాన్ని కూడా స్వచ్ఛంగా మార్చేస్తుంది ధూపం. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి తీసుకువస్తుంది. నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. హిందూ గ్రంథాలలో ధూపానికి ఉన్న ప్రాముఖ్యత తక్కువేమీ కాదు. ధూపం వేసే వస్తువులను బట్టి కూడా వేరువేరు ప్రయోజనాలని మనం పొందవచ్చు. ధూపం వేస్తే వ్యాధుల నుండి విముక్తి కూడా పొందవచ్చు. ధూపం వేయడం వలన ఆరోగ్యపరంగానే కాదు. ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి.

guggilam dhupam in home benefits

ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయడం వలన ఆరోగ్యంగా కాదు, ఆధ్యాత్మికంగా కూడా లాభాలు ఉంటాయి. గుగ్గిలం ధూపంని చాలామంది రోజూ ఇంట్లో వేస్తూ ఉంటారు. గురువారం నాడు కచ్చితంగా గుగ్గిలం ధూపం వేయాలి. గుగ్గిలం వాసన మెదడులో నొప్పి, అలాగే దానికి సంబంధించిన వ్యాధుల్ని తొలగించేస్తుం. గుండె నొప్పిని కూడా నివారించగలదు.

ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయడం వలన కలహాలు ఏమీ కూడా రావు. గుగ్గిలం ధూపం వేస్తే అతీంద్రియ లేదంటే దైవిక శక్తులని ఆకర్షిస్తుంది. ఇలా గుగ్గిలంతో ధూపం వేయడం వలన మనిషికి ఎన్నో లాభాలు ఉంటాయి. గుగ్గిలం ధూపం భూగోళానికి శాంతిని ఇస్తుంది. వాస్తు దోషాలని తొలగిస్తుంది. ప్రశాంతతనిస్తుంది. ఇలా గుగ్గిలం ధూపంతో చాలా లాభాలు ఉంటాయి.

Admin

Recent Posts