sports

6 Balls : క్రికెట్‌లో ఒక ఓవ‌ర్‌కు 6 బంతులే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక కార‌ణం ఏమిటి తెలుసా ?

6 Balls : ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్న ఆట‌ల్లో క్రికెట్ ఒకటి. దీన్ని త‌క్కువ దేశాలే ఆడ‌తాయి. కానీ పాపులారిటీ మాత్రం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ఇక ఐపీఎల్ రాక‌తో క్రికెట్ ద్వారా వినోదం మ‌రింత ఎక్కువైంది. అయితే టీ20, వ‌న్డే, టెస్టు.. ఇలా ఫార్మాట్ ఏదైనా స‌రే.. క్రికెట్‌లో ఒక ఓవ‌ర్‌కు 6 బంతుల‌నే వేస్తారు. అంత‌కు మించి లేదా అంతక‌న్నా త‌క్కువ‌గా బంతుల‌ను ఎందుకు వేయ‌రు ? కేవ‌లం 6 బంతులే ఒక ఓవ‌ర్‌కు ఎందుకు ఉంటాయి ? త‌క్కువ లేదా ఎక్కువ బంతులను పెడితే ఏమ‌వుతుంది ? సెట్ కాదా..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

అప్ప‌ట్లో.. అంటే క్రికెట మొద‌లైన తొలినాళ్లలో ఒక ఓవ‌ర్‌కు 4 బంతులే ఉండేవి. 1888 వ‌ర‌కు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాల‌లో, 1889 వ‌ర‌కు సౌతాఫ్రికాలో ఒక ఓవ‌ర్‌కు 4 బంతులనే వేసేవారు. త‌రువాత 1899 వ‌ర‌కు ఓవ‌ర్‌కు 5 బంతుల‌ను వేశారు. అయితే ఇలా వేయ‌డం వ‌ల్ల బౌలింగ్ జ‌ట్టు మాటి మాటికీ ఫీల్డింగ్‌ను మార్చాల్సి వ‌చ్చేది. ఎక్కువ సార్లు ఫీల్డ‌ర్ల‌ను అటు ఇటు తిప్పాల్సి వ‌చ్చేది. దీంతో చాలా స‌మ‌యం వృథా అయ్యేది. అందువ‌ల్ల దీన్ని నివారించ‌డం కోసం ఓవ‌ర్‌కు 8 బంతుల‌ను వేయ‌డం మొద‌లు పెట్టారు.

why there is only 6 balls in over in cricket

ఇలా కొంత‌కాలం పాటు ఓవ‌ర్‌కు 8 బంతులను వేశారు. అయితే ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల కేవ‌లం కొంద‌రు బౌల‌ర్ల‌కు మాత్ర‌మే బౌలింగ్ చేసే అవ‌కాశం వ‌చ్చేది. కెప్టెన్ల‌కు బౌలింగ్ ఆప్ష‌న్లు ఎక్కువ‌గా ఉండేవి కాదు. పైగా ఒక ఓవ‌ర్‌కు 8 బంతులు అంటే బౌల‌ర్‌పై బాగా ఒత్తిడి ప‌డేది. చాలా స‌మ‌యం పాటు ఒక్క‌డే బౌల‌ర్ బంతుల‌ను వేస్తూ ఉండాల్సి వ‌చ్చింది. అందులో నో బాల్స్‌, వైడ్స్ ఉంటే బౌల‌ర్‌పై ఇంకా భారం పెరుగుతుంది. దీంతో ఈ విధానం కూడా స‌రిగ్గా లేద‌ని భావించారు. త‌రువాత ఓవ‌ర్‌కు 6 బంతుల విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దీన్ని ప్ర‌వేశ‌పెట్టేందుకు ముందు బాగా అధ్య‌య‌నం చేశారు. ఇది స‌రిగ్గా ఉంద‌ని తేల‌డంతో.. దీన్నే అమ‌లుప‌రిచారు. ఓవ‌ర్‌కు 6 బంతులు ఉంటే అంద‌రికీ సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని తేల్చారు. క‌నుక‌నే అప్ప‌టి నుంచి ఓవ‌ర్‌కు 6 బంతుల‌ను వేయ‌డం మొద‌లు పెట్టారు. అది ఇప్పటికీ కొన‌సాగుతూనే వ‌స్తోంది. కానీ కొన్ని రూల్స్ ను మాత్రం మార్చారు. ఇదీ.. ఓవ‌ర్‌కు 6 బంతుల‌ను మాత్ర‌మే వేయ‌డం వెనుక ఉన్న అస‌లు కార‌ణం..!

Admin

Recent Posts