mythology

Bheema And Bakasura : భీముడు, బకాసురుడి కథ విన్నారా..?

Bheema And Bakasura : పాండవులు ఓ రోజు వెళ్తున్నప్పుడు ఒక బ్రాహ్మణ గ్రామస్తులు పాండవులకి ఆశ్రయం ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడికి పిల్లలు కూడా వున్నారు. కొన్ని రోజులు అంతా ఆనందంగా ఉన్నారు. ఒక రోజు తల్లి కుంతి బ్రాహ్మణుడు ఇంటి నుండి వస్తున్న ఏడుపుని వింటుంది. అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళింది. అయితే బ్రాహ్మణుడు జీవితాన్ని త్యాగం చేయడం తన బాధ్యత అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు. కుంతికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రశాంతంగా వివరించాలని బ్రాహ్మణుడిని ఆమె కోరింది.

అప్పుడు అతను బకాసురుడి కథని చెప్పాడు. ప్రతిరోజు ఒక అతను బండితో ఆహారం తీసుకుని రాక్షసుడు దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు రాక్షసుడు ఆ గ్రామస్తుడిని, ఆ ఆహారాన్ని కూడా తింటూ ఉంటాడు. ఆ విధంగా రాక్షసుడు చాలా మందిని ఇప్పటికే చంపేశాడ‌ట. ఈరోజు వారి కుటుంబం వంతు వచ్చింది. మా కుటుంబం నుండి ఒక సభ్యుడు ఆహారం తీసుకుని వెళ్లాలి. రాక్షసుడికి ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్పారు బ్రాహ్మణుడు. అది విన్న కుంతి నా కుమారుడు భీముడు మీకు సహాయం చేయగలడు అని చెప్పింది. నా కుమారుడు వెళ్తాడని ఆమె చెప్పింది.

have you heard about bheema and bakasura story

మీ కొడుకు చనిపోవడానికి నేను ఒప్పుకోను అని బ్రాహ్మణ స్త్రీ అంటుంది. భయపడవద్దు నా కొడుకు భీముడు ఇది వరకు కూడా రాక్షసుణ్ణి చంపాడ‌ని, సురక్షితంగా అతను తిరిగి వస్తాడని చెప్పింది. బియ్యం, పాలు, పండ్లు వంటివి అన్నీ కూడా భీముడు తీసుకువెళ్తాడు. అక్కడ బకాసురుడు కనపడలేదు. ఒక చెట్టు నీడలో కూర్చుంటాడు. కొంతసేపటికి ఆకలి వేస్తుంది. అరటి పండ్లను తినడం మొదలుపెట్టాడు. అరటి పండ్లు అయిపోయాయి. బియ్యం, పండ్లు, మిఠాయిలు అన్ని కూడా తినేస్తాడు. తెచ్చిన ఆహారాన్ని అంతటినీ కూడా భీముడు తినేస్తూ ఉంటాడు.

రాక్షసుడు భీకరంగా ఉన్నాడు. ఖాళీ బండిని చూసి కోపం వచ్చింది. భీముడు పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టడం మొదలుపెట్టాడు. నా ఆహారాన్ని తినడానికి నీకు ఎంత ధైర్యం అని అడిగాడు రాక్షసుడు. భీముడు నవ్వుతూ నేను ఆకలితో ఉన్నాను. నువ్వు ఆలస్యంగా వచ్చావు.. అంటాడు. ఇక వీళ్ళ మధ్య యుద్ధం మొదలైంది. పోరాటంలో భీముడు బకాసురుడుని చంపేశాడు. బకాసురుడిని ఒక తాడుతో బండికి కడతాడు. గ్రామం అంతా తిప్పుతాడు. గ్రామస్తులు రాక్షసుడు చనిపోయాడని తెలుసుకుంటారు. మొదట నమ్మలేరు. వాళ్ల కన్నీటితో భీముడికి కృతజ్ఞతలు చెబుతారు. ఇలా భీముడు, బ‌కాసురుడి క‌థ ఎంతో ఆస‌క్తిగా సాగుతుంది.

Admin

Recent Posts