వినోదం

అత్తారింటికి దారేది మూవీలో త్రివిక్రమ్ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. మీరు గమనించారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. పవన్ కల్యాణ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆ మధ్య కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ రికార్డులు బద్దలుకొట్టింది. గబ్బర్ సింగ్ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది మూవీ సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా స‌మంత న‌టించింది. ఇక ఈ సినిమాలో కామెడీ, ఎమోష‌నల్ సీన్లు ఓ రేంజ్ లో ఉంటాయి.

సినిమాలోని క్లైమాక్స్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే.. ఆ సీన్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అత్త‌ను ఇంటికి రావాలంటూ చెప్పే డైలాగులకు ప్రేక్ష‌కుల‌కు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే త్రివిక్ర‌మ్ సినిమాల్లో ఎన్నో లాజిక్ లు ఉంటాయి. కానీ అత్తారింటికి దారేది సినిమాలో మాత్రం త్రివిక్ర‌మ్ ఓ లాజిక్ ను మిస్ అయ్యారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్న స‌మ‌యంలో క‌మెడియ‌న్ అలీ వ‌చ్చి సిగ‌రెట్ తీసుకురావాల‌ని కోరుతాడు. అప్ప‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ ను అలీ డ్రైవ‌ర్ అనుకుంటాడు. దాంతో అప్ప‌టికే ఇంట్లో గొడ‌వ జ‌రిగి ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్న ప‌వ‌న్ అలీని చిత‌కబాదుతాడు.

have you observed this in attarintiki daredi movie

ఆ త‌ర‌వాత పాపం అనిపించి పిలిచి డ‌బ్బులు ఇస్తాడు. ఏకంగా సూట్కేస్ చేతిలో పెట్టి ఇందులో ఎంత ఉందో తెలియ‌దు తీసుకుపో అని చెబుతాడు. అప్ప‌టికే ఎంఎస్ నారాయ‌ణ సూట్కేస్ ను ఓపెన్ చేసి ప‌వ‌న్ కు ఇస్తాడు. పూర్తిగా ఓపెన్ చేయ‌కుండా దాని లాక్ ను అన్ లాక్ చేసిన‌ట్టు క్లియ‌ర్ గా క‌నిపిస్తుంది. కానీ అలీ ఆ సూట్కేస్ ప‌క్క‌కు తీసుకెళ్లి దీని తాళం ఇవ్వలేదు అని అడుగుతాడు. దాంతో ప‌వన్ అప్ప‌టికే తెరిచి ఉన్న సూట్కేస్ ను సుత్తితో ప‌గ‌ట‌గొట్టి అలీ చేతిలో ఒక నోట్ల క‌ట్ట మాత్రమే పెడ‌తాడు. కాగా అల్రెడీ లాక్ తీసి ఉన్న సూట్కేస్ ను ప‌గ‌ల‌గొట్ట‌డం ఏంటి.. ఇదెక్క‌డి లాజిక్ గురువుగారూ అంటూ త్రివిక్రమ్ ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు.

Admin

Recent Posts