Healthy Laddu : అంద‌రూ ఎంతో ఇష్టంగా తినే హెల్తీ ల‌డ్డూ.. త‌యారీ ఇలా..!

Healthy Laddu : హెల్తీ ల‌డ్డూలు.. డ్రై ఫ్రూట్స్ తో ఈ ల‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని రోజుకు ఒక‌టి చొప్పున తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. శ‌రీరం బ‌లంగా ధృడంగా త‌యార‌వుతుంది. పిల్ల‌ల‌కు ఈ ల‌డ్డూల‌ను ఇవ్వ‌డం వ‌ల్ల వారిలో ఎదుగుద‌ల చ‌క్క‌గా ఉంటుంది. గ‌ర్భిణీ స్త్రీలు ఈ ల‌డ్డూల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వారికి ఎంతో మేలు క‌లుగుతుంది. జ్ఞాప‌కశ‌క్తి పెరుగుతుంది. ఈ ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ ల‌డ్డూలను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్తీ ల‌డ్డూ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన బాదంప‌ప్పు – అర క‌ప్పు, త‌రిగిన జీడిప‌ప్పు – అర క‌ప్పు, త‌రిగిన పిస్తా ప‌ప్పు – పావు క‌ప్పు, ఎండు కొబ్బ‌రి తురుము – ఒక క‌ప్పు, గ‌స‌గ‌సాలు – పావు క‌ప్పు, బెల్లం – ఒక క‌ప్పు, నీళ్లు – పావు క‌ప్పు, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

Healthy Laddu recipe everybody likes
Healthy Laddu

హెల్తీ ల‌డ్డూ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక బాదంప‌ప్పు, జీడిపప్పు, పిస్తా వేసి వేయించాలి. త‌రువాత ఎండు కొబ్బ‌రి తురుము వేసి వేయించాలి. ఇది కొద్దిగా వేగిన త‌రువాత గ‌స‌గ‌సాలు వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో బెల్లం, నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం క‌రిగి లేత తీగ‌పాకం రాగానే మంట‌ను చిన్న‌గా చేసుకోవాలి. త‌రువాత మ‌రో టేబుల్ స్పూన్ నెయ్యి, యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు క‌లుపుతూ ఉడికించాలి. ఈ మిశ్ర‌మం ద‌గ్గ‌ర ప‌డ‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసి దీనిని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకోవాలి. ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత చేతుల‌కు నెయ్యి రాసుకుంటూ కొద్ది కొద్దిగా మిశ్ర‌మాన్ని తీసుకుంటూ ల‌డ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే హెల్తీ ల‌డ్డూలు త‌యార‌వుతాయి. ఇవి 10 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ విధంగా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా డ్రై ఫ్రూట్స్ తో రుచిక‌ర‌మైన ల‌డ్డూల‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts