Cashew Nuts : జీడిప‌ప్పుకు చెందిన నిజాలు ఇవి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

Cashew Nuts : మ‌నం వివిధ ర‌కాల డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటిలో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. జీడిప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. వంట‌ల్లో కూడా పేస్ట్ రూపంలో వీటిని వాడుతూ ఉంటాము. అలాగేజీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వీటిలో ప్రోటీన్, ఫైబ‌ర్, జింక్, మెగ్నీషియం, విట‌మిన్ బి, విట‌మిన్ కె, పొటాషియం వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె జ‌బ్బులు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మైగ్రేన్ త‌ల‌నొప్పి, ఒత్తిడి, ఆందోళ‌న‌తో బాధ‌ప‌డే వారు జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

అంతేకాకుండా జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎక్కువ స‌మ‌యం వ‌ర‌కు ఆక‌లి కాకుండా ఉంటుంది. వీటిని స్నాక్స్ గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అలాగే జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల కంటిచూపు మెరుగుప‌డుతుంది. చ‌ర్మం మ‌రియు జుట్టు ఆరోగ్యంగా త‌యార‌వుతాయి. సంతాన లేమి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అదేవిధంగా జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాము. ఈ విధంగా జీడిప‌ప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిప‌ప్పులో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీటిని త‌గిన మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. జీడిప‌ప్పును ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి.

Cashew Nuts important facts to know
Cashew Nuts

కొంద‌రిలో ఈ జీడిప‌ప్పు అల‌ర్జీని కూడా క‌లిగించ‌వ‌చ్చు. వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య త‌లెత్తుతుంది. అలాగే చాలా మంది వీటిని నెయ్యిలో వేయించి ఉప్పు, కారం, మ‌సాలాలు చ‌ల్లుకుని తింటూ ఉంటారు. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మేలు చేసే జీడిప‌ప్పు అనారోగ్యానికి దారి తీస్తుంది. ఇలా వేయించి జీడిప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక జీడిప‌ప్పును నీటిలో నాన‌బెట్టి మాత్ర‌మే తీసుకోవాలి. ఈ విధంగా త‌గిన మోతాదులో నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌నం జీడిప‌ప్పు వ‌ల్ల క‌లిగే పూర్తి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts