Paneer Sandwich : ప‌నీర్ శాండ్‌విచ్‌ను ఇలా 10 నిమిషాల్లో చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Paneer Sandwich : మ‌న‌కు బేక‌రీల‌ల్లో ల‌భించే ప‌దార్థాల్లో ప‌నీర్ సాండ్విచ్ కూడా ఒక‌టి. ఈ సాండ్విచ్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు దీనిని మ‌రింత ఇష్టంగా తింటారు. ఈ ప‌నీర్ సాండ్విచ్ ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. పిల్ల‌ల‌కు లంచ్ బాక్స్ లో కూడా ఈ సాండ్విచ్ ను పెట్ట‌వ‌చ్చు. రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా, బేక‌రీ స్టైల్ లో ప‌నీర్ సాండ్విచ్ ను ఎలా త‌య‌రు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ సాండ్విచ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ – 4, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, పొడవుగా త‌రిగిన ఉల్లిపాయ – 1, పొడ‌వుగా త‌రిగిన క్యాప్సికం – 1, ప‌నీర్ తురుము – ఒక క‌ప్పు, చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – పావు టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – అర టీ స్పూన్, ట‌మాట సాస్ – ఒక టీ స్పూన్, పిజ్జా మిక్స్ లేదా మిక్డ్స్ హెర్బ్స్ – కొద్దిగా.

Paneer Sandwich recipe in telugu make in this method
Paneer Sandwich

ప‌నీర్ సాండ్విచ్ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, క్యాప్సికం వేసి వేయించాలి. వీటిని మెత్త‌బ‌డే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌నీర్ తురుము వేసి వేయించాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన త‌రువాత చీజ్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉప్పు, మిరియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత చాట్ మ‌సాలా, రెడ్ చిల్లీ సాస్, ట‌మాట సాస్ వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత పిజ్జా మిక్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ను తీసుకుని దానిపై ప‌నీర్ మిశ్ర‌మాన్ని ఉంచి స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత దీనిపై మ‌రో బ్రెడ్ ను ఉంచి వ‌త్తాలి. త‌రువాత ఈ బ్రెడ్ పై బ‌ట‌ర్ ను రాసి పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఒక‌వైపు కాలిన త‌రువాత మ‌రో వైపుకు తిప్పి మ‌ర‌లా కొద్దిగా బ‌ట‌ర్ రాసి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న త‌రువాత ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌నీర్ సాండ్విచ్ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు రుచిగా ప‌నీర్ తో సాండ్విచ్ త‌యారు చేసి తీసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts