vastu

Heavy Items In Home : ఇంట్లో బ‌రువైన వ‌స్తువుల‌ను ఎక్క‌డ ప‌డితే అక్క‌డ పెట్ట‌కండి.. వాస్తు దోషం.. ఎక్క‌డ పెట్టాలంటే..?

Heavy Items In Home : ప్ర‌స్తుత త‌రుణంలో ఇల్లు క‌ట్టుకోవాల‌న్నా.. క‌ట్టిన ఇంటిని కొనాల‌న్నా.. చాలా మంది 100 శాతం వాస్తుకు ఉంటేనే తీసుకుంటున్నారు. ఎందుకంటే వాస్తు దోషం లేకుండా ఇల్లు ఉంటేనే అప్పుడు అందులో ఉండే వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. క‌నుక వాస్తు అనేది త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఇక వాస్తు దోషాల విష‌యానికి వ‌స్తే.. ఇంటిలో బ‌రువైన వ‌స్తువుల‌ను పెట్టేందుకు కూడా వాస్తు చూడాలి. అలా కాకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ బ‌రువైన వ‌స్తువుల‌ను పెడితే దాంతో దోషం ఏర్ప‌డుతుంది. అది స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తుంది. క‌నుక ఇంట్లో బ‌రువైన వ‌స్తువుల‌ను ఎక్క‌డ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో పొరపాటున కూడా ఈశాన్యంలో ఎటువంటి వస్తువులను పెట్టకూడదు. తూర్పు ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో బరువైన వస్తువులను పెడితే జీవితం అంతే భారంగా ఉంటుంది. ఈశాన్యంలో బరువైన వస్తువులను పెట్టటం వలన అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే గృహ మధ్యంలో, హాల్‌లో కూడా ఎటువంటి బరువైన వస్తువులను పెట్టకూడదు. చాలా మంది బాగా బరువున్న సోఫాలను, డైనింగ్ టేబుల్స్ ను పెట్టటం మంచిది కాదని చెబుతారు. బరువు పెట్టాల్సింది అక్కడే. వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు పురుషుడు ఈశాన్యానికి తల, నైరుతి దిశకు కాళ్ళు పెట్టుకున్న భంగిమలో ఉంటాడు. వాస్తు పురుషుడి భంగిమను బట్టి మనం అర్ధం చేసుకోవాల్సింది బరువు శరీరంపై పెట్టకూడద‌ని.

Heavy Items In Home do not put them anywhere

వాస్తు పురుషుడి కాళ్ళ భాగంలో బరువు పెట్టటం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే నైరుతి దిశలోనే బరువు పెట్టాలని అంటున్నారు. అక్కడ బరువు పెట్టడం వల్ల బోలెడు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో బరువైన వస్తువులను పెట్టాలి అనుకుంటే కచ్చితంగా నైరుతి దిశలోనే పెట్టాలి. అందులోనూ దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి దిశలలో బరువైన వస్తువులను పెట్టుకోవాలి. ఈ ప్రదేశాలలో ఎంత బరువైన వస్తువులు పెడితే అంత మంచిదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఉత్తరం వైపున కానీ, ఇంటి టెర్రస్ పైన కానీ పొరపాటున కూడా బరువైన వస్తువులను పెట్టకూడదు.

అంతేకాదు నైరుతి దిశలో బరువైన వస్తువులను పెట్టడం వల్ల అనేక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. జీవితం సాఫీగా సాగుతుంది. నైరుతి దిశలో ఎటువంటి తలుపులను, కిటికీలను పెట్టకూడదు. చాలామంది ఇళ్లల్లో స్టోర్ రూమ్ లలోనూ పాత సామాన్లన్నీ వేసి నింపుతూ ఉంటారు. స్టోర్ రూమ్ లో సైతం ఈశాన్యం వైపు బరువు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈశాన్యంలో తెలిసీ తెలియక బరువైన వస్తువులు పెడితే దాని ప్రభావం కచ్చితంగా జీవితం పైన ఉంటుంది. ఈశాన్యం వైపు వస్తువులు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద చెట్లు కూడా లేకుండా చూసుకోవాలి. ఎంత ఖాళీగా ఉంటే, ఎంత శుభ్రంగా ఉంటే అంత కల‌సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Admin

Recent Posts