Egg Fried Rice : ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఇలా చేస్తే.. విడిచిపెట్ట‌కుండా తినేస్తారు..!

Egg Fried Rice : మ‌న‌లో చాలా మంది కోడిగుడ్ల‌ను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల త‌క్కువ ధ‌ర‌లో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. కోడిగుడ్ల‌ను చాలా మంది ఉడికించి నేరుగా తింటూ ఉంటారు. కొంద‌రు కూర‌గా వండుకుని తింటారు. అంతేకాకుండా వీటితో ఫ్రైడ్ రైస్ ను కూడా చేసుకుని తింటూ ఉంటారు. కోడిగుడ్ల‌తో చేసే ఫ్రైడ్ రైస్ మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతుంది. ఈ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను మ‌నం ఇంట్లోనే చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ఫ్రైడ్ రైస్ త‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు..

కోడి గుడ్లు – 4, నాన‌బెట్టిన బాస్మతి బియ్యం – ఒక గ్లాస్ లేదా 200 గ్రాములు, నీళ్లు – ఒక‌టిన్న‌ర గ్లాస్, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – పావు క‌ప్పు, చిన్నగా త‌రిగిన బీన్స్ – అర క‌ప్పు, క్యాబేజ్ తురుము – అర క‌ప్పు, చిన్నగా త‌రిగిన క్యాప్సిక‌మ్ – అర క‌ప్పు, చిన్నగా త‌రిగిన ఉల్లికాడ‌లు – పావు క‌ప్పు, చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – ఒక టీ స్పూన్, వెనిగ‌ర్ – ఒక టీ స్పూన్.

here it is how you can make Egg Fried Rice in simple method
Egg Fried Rice

ఎగ్ ఫ్రైడ్ రైస్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి అందులో నిమ్మ‌రసాన్ని, అర టీ స్పూన్ నూనెను, త‌గినంత ఉప్పును, నాన‌బెట్టిన బాస్మ‌తి బియ్యాన్ని వేసి క‌లిపి పొడి పొడిగా వండుకోవాలి. అన్నం ఉడికిన త‌రువాత ఒక ప్లేట్ లోకి చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఆర‌బెట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో లేదా గ్లాస్ లో కోడిగుడ్ల‌ను వేసి తెల్ల పొస‌, ప‌చ్చ సొన క‌లిసేలా బాగా క‌ల‌పాలి. ఇప్పుడు ఒక క‌ళాయిలో అర టేబుల్ స్పూన్ నూనెను వేసి నూనె కాగిన త‌రువాత కోడిగుడ్డు మిశ్ర‌మాన్ని వేయాలి. ఇందులోనే మిరియాల పొడి, త‌గినంత‌ ఉప్పు వేసి బాగా క‌లిపి చిన్న చిన్న ముక్క‌లుగా చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

అదే క‌ళాయిలో నూనె వేసి నూనె కాగిన త‌రువాత మ‌ధ్య‌స్థ మంట‌పై వెల్లుల్లి రెబ్బ‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, బీన్స్ ముక్క‌లు, క్యాబేజ్ తురుము, క్యాప్సిక‌మ్ ముక్క‌లు, ఉల్లికాడ‌ల‌ను ఒక దాని త‌రువాత ఒక‌టిగా రెండు నిమిషాల వ్య‌వ‌ధితో వేస్తూ వేయించుకోవాలి. త‌రువాత చిల్లీ సాస్ ను, సోయా సాస్ ను, వెనిగ‌ర్ ను, ఉప్పును వేసి కల‌పాలి. త‌రువాత ముందుగా చిన్న ముక్క‌లుగా చేసుకున్న కోడిగుడ్ల‌ను వేసి క‌లిపి 2 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు చ‌ల్లార బెట్టిన అన్నాన్ని వేసి బాగా క‌లిపి 3 నిమిషాల పాటు ఉంచి చివ‌ర‌గా కొద్దిగా ఉల్లికాడ‌ల‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ త‌యార‌వుతుంది. దీన్ని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది.

D

Recent Posts