Home Tips : మనం ప్రతిరోజూ అనేక రకాల పనులను చేస్తూ ఉంటాం. మనం చేసే పనుల్లో కొన్ని పనులను తెలిసి తెలియక తప్పుగా చేస్తూ ఉంటాం. వాటిని తప్పుగా చేస్తున్నాం అన్న సంగతి కూడా మనకు తెలియదు. మనం తప్పుగా చేస్తున్న పనులు ఏమిటి..వీటిని ఎలా సరిదిద్దుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది అరటిపండు తొక్కను పై భాగంలో ఉండే తొడిమె దగ్గర నుండి తీస్తారు. కానీ అరటి పండును కింది భాగంలో ఉండే తొడిమ దగ్గర నుండి ఇలా తీయడం వల్ల అరటి పండు యొక్క దారాలాంటి నిర్మాణాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే చాలా మంది కోడిగుడ్లను ఫ్రిజ్ లో నిల్వ చేస్తారు. ఈ కోడిగుడ్లను ఫ్రిజ్ డోర్ కు ఉండే ఎగ్ కంపార్ట్ మెంట్ లో నిల్వ చేస్తారు.
కోడిగుడ్లు తాజాగా ఉండాలంటే 68 ఫారన్ హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. అలాగే ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. కానీ మనం ఫ్రిజ్ డోర్ ను ఎక్కువగా తెరుస్తూ మూస్తూ ఉంటాం. కనుక ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. అలాగే ఫ్రిజ్ డోర్ వద్ద ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. కోడిగుడ్లను ఫ్రిజ్ మెయిన్ కంపార్ట్ మెంట్ లో లోపలికి ఉంచాలి. ఇక్కడ చాలా చల్లగా ఉండడంతో పాటు ఉష్ణోగ్రత కూడా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇదే విధంగా పాలను కూడా ఫ్రిజ్ డోర్ లో ఉంచకూడదు. వీటిని కూడా ఫ్రిజ్ లో లోపలి వైపు ఉంచాలి. అదే విధంగా పేపర్ పై మనం ఏదైనా తప్పుగా రాసినప్పుడు దానిని ఎవరూ చూడకూడదని పెన్ తో గీతలు గీస్తూ ఉంటాం. ఇలా గీతలు గీయడం వల్ల మనం రాసిన అక్షరాలు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాంటప్పుడు మనం రాసిన అక్షరాలపై సంబంధం లేని ఇతర అక్షరాలను రాసి స్ట్రెయిట్ లైన్స్ ను కాకుండా పిచ్చి పిచ్చి గీతలను గీయాలి. ఇలా చేయడం వల్ల మనం రాసుకున్న విషయాలు ఎవరికి తెలియకుండా ఉంటాయి. చాలా మంది జుట్టు జారిపోకుండా ఉండడానికి బాబి పిన్స్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని ఉపయోగించినప్పుడు జుట్టు కిందికి జారిపోతూ ఉంటుంది. దానికి కారణం ఈ పిన్ ను మీరు తప్పుగా పెట్టుకోవడమే. సాధారణంగా దీనిని వేవ్స్ ఆకారం పైకి ఉండేలా పెట్టుకుంటారు. కానీ ఈ వేవ్స్ ఆకారం కిందికి వెళ్లి స్ట్రెయిట్ గా ఉన్న ఆకారం పైకి వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు జారిపోకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ పిన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
అలాగే చాలా మంది బోర్లా పడుకుంటూ ఉంటారు. బోర్లా పడుకోవడం వల్ల అలసట, నొప్పులు ఎక్కువవుతాయి. బోర్లా పడుకోవడం మన కంఫర్ట్ గా ఉన్నప్పటికి అది మన వెన్నెముకకు అంత మంచిది కాదు. ఇలా పడుకోవడం వల్ల పొట్టపై ఒత్తిడి పడడంతో పాటు మెడ నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక బోర్లా పడుకోవాలనుకునే వారు హిప్స్ కింద మెత్తటి దిండును పెట్టుకుని తినడం వల్ల ఎటువంటి సమస్య తలెత్తకుండా ఉంటుంది. అలాగే చాలా మంది వైన్ గ్లాస్ ను బల్బులా ఉండే దాని కింది భాగాన్న పట్టుకుని వైన్ ను తాగుతూ ఉంటారు. కానీ వైన్ రుచిని, చక్కటి వాసనను ఆస్వాదించాలంటే వైన్ గ్లాస్ యొక్క సన్నటి పైప్ లాంటి నిర్మాణాన్ని పట్టుకుని వైన్ తాగాలి. అప్పడు వైన్ యొక్క చక్కటి వాసనను మనం తెలుసుకోగలుగుతాము.