Teeth Pain : పుచ్చిపోయిన దంతాల‌పై ఇలా చేస్తే.. నొప్పి త‌గ్గుతుంది.. దంతాల‌ను పీకించాల్సిన ప‌నిలేదు..!

Teeth Pain : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అనేక మంది దంత సంబంధ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. దంతాలు పుచ్చిపోయి ఇబ్బందులు ప‌డుతున్నారు. దంతాలు పుచ్చిపోవ‌డం వల్ల తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. దీంతో ఏమీ తిన‌లేరు. మింగ‌లేరు. దంతాలు పుచ్చిపోయేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. దంతాల‌ను రోజూ స‌రిగ్గా శుభ్రం చేయ‌క‌పోవ‌డం, క్రిములు ఎక్కువ‌గా చేర‌డం, ఇంకా దంతాలు బ‌ల‌హీనంగా ఉండ‌డం, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల దంతాలు పుచ్చిపోతుంటాయి. అయితే దంతాలు పుచ్చి పోతే స‌హ‌జంగానే మ‌నం డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్తుంటాం.

దంతాలు పుచ్చిపోయి తీవ్రమైన నొప్పి వ‌స్తుంటే మ‌నం త‌ప్ప‌నిస‌రిగా డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్తాం. దీంతో వారు దంతాల‌ను పీకేస్తారు. అయితే దంతాల‌ను పీకేయ‌డం అంత మంచిది కాద‌ని కొంద‌రు డాక్ట‌ర్లు కూడా చెబుతుంటారు. అందుకు గాను వారు నొప్పి త‌గ్గేందుకు కొన్ని మందుల‌ను కూడా రాస్తుంటారు. అయితే మందుల‌ను వాడినంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ నొప్పి మ‌ళ్లీ వ‌స్తుంది. మందుల‌ను ఆపితే నొప్పి తిర‌గ‌బెడుతుంది. దీంతో మ‌నం మళ్లీ డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్తాం. దీంతో వారు త‌ప్ప‌నిస‌రిగా దంతాల‌ను పీకేస్తారు. అయితే ఇలాంటి ఇబ్బంది ప‌డాల్సిన ప‌నిలేదు. పుచ్చిపోయిన దంతాల స‌మ‌స్య‌కు మ‌న ఇంట్లోనే చ‌క్క‌ని ప‌రిష్కారం ఉంది. అదేమిటంటే..

use patika in this way for Teeth Pain and cavities
Teeth Pain

మ‌న‌కు మార్కెట్‌లో ఆయుర్వేద షాపుల్లో స్ఫ‌టికం అనే పిల‌వ‌బ‌డే తెల్ల‌ని ప‌దార్థం ల‌భిస్తుంది. దీన్నే కొంద‌రు ప‌టిక అని కూడా అంటారు. దీన్ని ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తారు. దీంతో ప‌లు ఔష‌ధాల‌ను త‌యారు చేస్తారు. ఇది యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటుంది. ఇది రుచిలో వ‌గ‌రుగా ఉంటుంది. దీన్ని చాలా మంది దిష్టి తీసేందుకు లేదా దిష్టి త‌గ‌ల‌కుండా గుమ్మాల‌కు కూడా క‌డుతుంటారు. అయితే ఈ ప‌టికను ఉప‌యోగించి మ‌నం పుచ్చిపోయిన దంతాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా చిన్న ప‌టిక ముక్క‌ను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో 10 నిమిషాల పాటు నాన‌బెట్టాలి. దీంతో ప‌టిక పూర్తిగా క‌రిగిపోతుంది. అప్ప‌టికి కూడా క‌ర‌గ‌క‌పోతే స్పూన్‌తో తిప్పాలి. దీంతో ప‌టిక క‌రుగుతుంది. ఇలా ప‌టిక క‌రిగిన నీళ్ల‌ను నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. అలాగే గొంతులో పోసుకుని గ‌ర‌గ‌ర‌మ‌ని శబ్దం వ‌చ్చేలా పుక్కిలించాలి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు చేయాలి. ఇలా రోజూ చేస్తుంటే పుచ్చిపోయిన దంతాల నొప్పి త‌గ్గుతుంది. దీంతో నొప్పి మ‌టుమాయం అయి దంతాలు సుర‌క్షితంగా మారుతాయి. దంతాల నొప్పి మ‌ళ్లీ రాదు. అలాగే డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి దంతాల‌ను పీకించుకోవాల్సిన అవ‌స‌రం రాదు. ఇలా ప‌టిక‌తో పుచ్చిపోయిన దంతాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు.

Share
Editor

Recent Posts