Hotel Style Punugulu : బ‌య‌ట బండి మీద అమ్మేలాంటి పునుగుల‌ను ఇంట్లోనే ఇలా చేసుకోండి..!

Hotel Style Punugulu : హోట‌ల్స్ లో సాయంత్రం స‌మ‌యాల్లో ల‌భించే చిరుతిళ్లల్లో పునుగులు కూడా ఒక‌టి. క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే పునుగుల‌ను తిన‌డానికి అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ప‌ల్లి చ‌ట్నీతో క‌లిపి తింటే ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ పునుగుల‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డానికి చాలా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే పునుగుల‌ను ఏవిధంగా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హోట‌ల్ స్టైల్ పునుగుల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఇడ్లీ పిండి – ఒక క‌ప్పు, మైదా పిండి – అర క‌ప్పు, వంట‌సోడా – చిటికెడు, ఉప్పు – త‌గినంత‌, నూనె – డీప్ ఫ్రై కు స‌రిప‌డా.

Hotel Style Punugulu recipe in telugu make in this method
Hotel Style Punugulu

హోటల్ స్టైల్ పునుగుల త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండిని తీసుకోవాలి. త‌రువాత అందులో ఉప్పు, మైదాపిండి వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. పిండి గ‌ట్టిగా ఉండే కొద్దిగా నీటిని పోసి క‌లుపుకోవాలి. తరువాత దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత ఈ పిండిలో వంట‌సోడా వేసి క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక పిండిని ఒక ప‌క్క నుండి తీసుకుంటూ పునుగుల్లా వేసుకోవాలి. వీటిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ ఎర్ర‌గా అ య్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిగా హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఉండే పునుగులు త‌యార‌వుతాయి. వీటిని ఉల్లిపాయ‌లు, ట‌మాట చ‌ట్నీ లేదా ప‌ల్లి చ‌ట్నీతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇడ్లీ పిండి మిగిలిన‌ప్పుడు ఇలా పునుగులుగా వేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts