House Cleaning Tips : ఇంటిని తుడిచే నీటిలో దీనిని క‌ల‌పండి.. బొద్దింక‌లు, పురుగులు, క్రిముల బెడద ఉండ‌దు..!

House Cleaning Tips : వ‌ర్షాకాలంలో ఎక్క‌డ చూసినా తేమ వాతావ‌ర‌ణం ఉంటుంది. దీంతో ఏం ట‌చ్ చేసినా కూడా త‌డిగా అనిపిస్తుంది. ఇలాంటి వాతావ‌ర‌ణంలో కీట‌కాలు, సూక్ష్మ‌క్రిములు, పురుగులు ఎక్కువ‌గా పెరుగుతాయి. దీని వ‌ల్ల మ‌న‌కు అన్నీ ఇబ్బందులే వ‌స్తుంటాయి. ఇంట్లో ప‌రిశుభ్రంగా లేక‌పోతే మ‌న‌కు అనేక వ్యాధులు వ‌స్తాయి. ముఖ్యంగా చిన్నారులు ఉన్న ఇంట్లో అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి. వారు అన్ని వ‌స్తువుల‌ను ప‌ట్టుకుని అదే చేతి వేళ్ల‌ను నోట్లో పెట్టుకుంటారు. దీంతో వారు త్వ‌ర‌గా అనారోగ్యాల బారిన ప‌డే ప్ర‌మాదం ఉంది. క‌నుక ఇంటిని ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం ముఖ్యం. అయితే ఇల్లు క్లీన్ చేసేట‌ప్పుడు ఈ టిప్స్ పాటిస్తే దాంతో మీ ఇంటిని మ‌రింత క్లీన్‌గా ఉంచుకోవ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా.

మిరియాల‌ను మ‌నం ఎప్ప‌టినుంచో వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నాం. వీటిని మ‌నం త‌ర‌చూ వంట‌ల్లో వాడుతుంటాం. ఇవి ఘాటుగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి. అయితే మిరియాల‌ను మెత్త‌ని పొడిలా చేసి ఇంటిని తుడిచే నీటిలో కాస్త వేసి క‌లిపి క్లీన్ చేయాలి. దీని వ‌ల్ల సూక్ష్మ క్రిముల బెడ‌ద ఉండ‌దు. ముఖ్యంగా చిమ‌ట‌లు, బొద్దింక‌లు, పురుగుల‌, ఈగ‌లు పారిపోతాయి. అలాగే బేకింగ్ సోడా, వెనిగ‌ర్ మిశ్ర‌మం కూడా ప‌నిచేస్తుంది.

House Cleaning Tips follow these for better healthy home
House Cleaning Tips

బేకింగ్ సోడా, వెనిగ‌ర్‌ను క‌లిపి ఆ మిశ్ర‌మంతో ఇంటిని తుడ‌వాలి. ఇది కూడా బ్యాక్టీరియా, క్రిములను నాశ‌నం చేస్తుంది. దీంతో ఇల్లు క్లీన్ అవుతుంది. అదేవిధంగా ప‌టిక పొడిని నీటిలో వేసి కూడా ఇంటిని శుభ్రం చేసుకోవ‌చ్చు. ఇది కూడా మ‌న‌కు ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. ఈ విధంగా ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మీ ఇల్లు నీట్‌గా ఉంటుంది. అయితే ఇంటిని క్లీన్ చేసేట‌ప్పుడు ఇవే కాకుండా మీకు మార్కెట్ లో ల‌భించే ఫ్లోర్ క్లీన‌ర్స్‌ను కూడా వాడాలి. అప్పుడే ఇల్లు శుభ్రంగా ఉంటుంది. వారంలో క‌నీసం 2 నుంచి 3 సార్లు ఇంటిని తుడ‌వాలి. దీని వ‌ల్ల సూక్ష్మ క్రిముల బెడ‌ద త‌ప్పుతుంది.

Editor

Recent Posts