Brown Rice : బ్రౌన్ రైస్.. వీటిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని వండుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన పద్దతులు ఉన్నాయి. ఎలా పడితే అలా వండితే ప్రయోజనం ఉండదు. ప్రస్తుత కాలంలో వీటిని వాడే వరకు రోజురోజుకు ఎక్కువవుతున్నారు. బ్రౌన్ రైస్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు కూడా చెప్పడంతో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. బ్రౌన్ రైస్ తియ్యగా ఉండదు. దీనిని ఎక్కువగా తినలేరు. కొందరు దీనిని రెండు రోజులు తిని పక్కకు పడేస్తూ ఉంటారు. కొందరు బ్రౌస్ రైస్ తింటే అరగడం లేదు, గ్యాస్ సమస్య తలెత్తుతుంది అని చెప్పడం కూడా మనం వినే ఉంటాం. ఇలా అజీర్తి సమస్య తలెత్తతడంలో నిజమూ లేకపోలేదు. మనం నాలుక, జీర్ణాశయం తెల్ల బియ్యం తినడానికి అలవాటు పడిపోయింది.
సంవత్సరాల తరబడి తెల్లబియ్యం తినడానికి అలవాటు పడిన మనం ఉన్నట్టుండి బ్రౌన్ రైస్ తినాలంటే చాలా కష్టమవుతుంది. చక్కగా అరిగేలా, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా కాస్తంత మనం తినగలిగేలా ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ బ్రౌన్ రైస్ తినాలని అనుకున్నప్పుడు ఒక పూట లేదా అవకాశం ఉంటే 20 గంటలకు ముందుగా వండుకునే బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఎక్కువ నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఆ తరువాత అన్నం వండే ముందు ఈ నీళ్లలో నుండి ఒక లీటర్ నీటిని తీసి ఫ్రిజ్ లో లేదా చల్లని ప్రదేశంలో ఉంచుకోవాలి. ఒక మిగిలిన నీళ్లను పారబోసి బియ్యాన్ని బాగా కడిగి ఒక గ్లాస్ కు రెండు గ్లాసుల కొలతతో నీళ్లు పోసి వండుకోవాలి.
మొదటి రోజు పెద్దగా తేడా తెలియదు. రెండో రోజు కూడా ఆదే పద్దతి అవలంబించాలి. అయితే చిన్న మార్పు చేయాలి. మళ్లీ అన్నం వండుకునేటప్పుడు బ్రౌన్ రైస్ ను శుభ్రంగా కడిగి ముందు రోజు ఫ్రిజ్ లో ఉంచిన నీటిని పోసి నానబెట్టుకోవాలి. ఇలా ప్రతిసారి వండే ముందు ఒక లీటర్ నీటిని తీసుకోవడం, ఈ నీళ్లను నానబెట్టుకునే ముందు కలుపుకోవడం చేస్తూ ఉండాలి. ఇలా నీళ్లు తీసి దాచుకోవడం వల్ల నీళ్లు పులుస్తూ ఉండడం జరుగుతుంది. ఇలా నీళ్లు పులియడం వల్ల ప్రోబయాటిక్ బ్యాక్టీరియా పెరిగి అన్నం బాగా జీర్ణం అవ్వడానికి తోడ్పడతాయని వైద్య శాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా ఈ పద్దతి పాటించడం వల్ల ఎమినో యాసిడ్లు ఈ బియ్యంతో మరింత పెరుగుతాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఈ విధంగా బ్రౌన్ రైస్ ను వండుకుని తినడం వల్ల బ్రౌన్ రైస్ త్వరగా జీర్ణమవ్వడంతో పాటు గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.