Home Tips

టీ పొడి లేదా తేయాకులు కల్తీ అయ్యాయనుకుంటున్నారా..? ఇలా గుర్తించండి..!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ అయిన ఆహార పదార్థాలే మనకు లభిస్తున్నాయి. ఆహార పదార్థాల కల్తీ అనేది నేటి తరుణంలో సర్వ సాధారణం అయిపోయింది. ఈ క్రమంలో అసలు పదార్థాలను గుర్తించడం చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా మనం నిత్యం సేవించే టీ పొడిని కూడా ఇప్పుడు కల్తీ చేస్తున్నారు. అయితే కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే మీరు వాడుతున్న టీ పొడి కల్తీ అయిందా, లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే…

1. కొన్ని తేయాకులను తీసుకుని ఫిల్టర్ పేపర్ లేదా బ్లాటింగ్ పేపర్‌పై వేసి నీళ్లు చల్లాలి. అనంతరం ఆకులను తీసేసి ఆ పేపర్‌ను ట్యాప్ వాటర్‌తో కడగాలి. పేపర్‌పై ఎలాంటి మరకలు పడకపోతే ఆ తేయాకులు కల్తీ జరగలేదని గుర్తించాలి. అదే కల్తీ జరిగితే పేపర్‌పై కోల్ తార్ మరకలు కనిపిస్తాయి.

how to identify adulterated tea powder

2. టీ పొడి లేదా ఆకులను ఒక గ్లాస్ ప్లేట్‌పై వేసి వాటిపై అయస్కాంతం ఉంచాలి. ఒక వేళ ఆ పొడి లేదా ఆకుల్లో ఐరన్ ఉంటే వెంటనే అయస్కాంతానికి ఆ ఐరన్ అంటుకుంటుంది. దీంతో ఆ టీ పొడి కల్తీ జరిగిందని గుర్తించాలి.

3. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో టీ పొడి లేదా తేయాకులు కొన్నింటిని వేయాలి. అవి కల్తీవైతే నీళ్ల రంగు మారుతుంది. అసలువైతే నీళ్లు అలాగే ఉంటాయి. రంగు మారవు.

Admin

Recent Posts