Upma : ఉప్మా చేసేటప్పుడు ఈ విషయాలపై శ్రద్ద వహించండి.. ఉప్మా సాఫ్ట్ గా చాలా బాగా వస్తుంది..

Upma : ఉప్మా.. బొంబాయి ర‌వ్వ‌తో చేసే వంట‌కాల్లో ఇది ఒక‌టి. ఉద‌యం అల్పాహారంగా లేదా స్నాక్స్ గా దీనిని తీసుకుంటూ ఉంటాం. ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా నిమిషాల్లోనే దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. కానీ ఎంత రుచిగా ఉన్న‌ప్ప‌టికి చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అయితే ఉప్మాను ఇష్ట‌ప‌డని వారు కూడా లొట్ట‌లేసుకుంటూ తినేలా మ‌నం ఉప్మాను త‌యారు చేయ‌వ‌చ్చు. చాలా సుల‌భంగా, మ‌రింత రుచిగా అంద‌రికి న‌చ్చేలా ఉప్మాను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్మా తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – ఒక టీ స్పూన్, బొంబాయి ర‌వ్వ – ఒక క‌ప్పు, నూనె – 4 టీ స్పూన్స్, ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు -15, ఆవాలు -ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – 1, నీళ్లు – 3 క‌ప్పులు, ఉప్పు – త‌గినంత‌, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

how to make Upma soft and tasty
Upma

ఉప్మా త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక ర‌వ్వ‌ను వేసి వేయించాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ప‌ల్లీలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌ర‌వుఆత రువాత జీడిపప్పు వేసి వేయించాలి. త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప‌ప్పు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ‌ల‌ను వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత నీళ్లు, ఉప్పు వేసి క‌ల‌పాలి.

నీళ్లు మ‌రిగిన త‌రువాత వేయించిన ర‌వ్వ వేసి క‌ల‌పాలి. దీనిని మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ ఉడికించిన త‌రువాత నిమ్మ‌ర‌సం, వేయించిన ప‌ల్లీలు, జీడిప‌ప్పు వేసి క‌ల‌పాలి. ఉప్మా ద‌గ్గ‌ర ప‌డిన త‌రువాత మూత పెట్టి చిన్న మంట‌పై మ‌రో 3 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత కొత్తిమీర, మ‌రి కొద్దిగా నెయ్యి వేసి కలిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉప్మా త‌యార‌వుతుంది. దీనిని ఏ చ‌ట్నీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది.

D

Recent Posts