Buttermilk Rice With Onion : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సామెత మీరు అందరూ వినే ఉంటారు. ఉల్లి ఒంటికి చలువ చేస్తుందని చెబుతుంటారు. కానీ ఉల్లిపాయను మజ్జిగలో భాగంగా తింటే పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తాజాగా పరిశోధనలో తేలింది. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని వెల్లడైంది. అంతేకాదు ఉల్లిపాయని క్రమం తప్పకుండా తినేవారి ఎముకల పటుత్వం బాగా ఉంటుంది. రెండుపూటలా పచ్చి ఉల్లిపాయని మజ్జిగ అన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు. ఇంకా మీకు తెలియని ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఓసారి చూడండి.
ఉల్లిపాయలో యాంటిబయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉంటాయి. ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఇది కచ్చితంగా మంచి నిద్రను ఇస్తుంది. జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు మజ్జిగలో ఉల్లిపాయను తింటే జీర్ణక్రియకు సహాయం చేసే జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
ఉల్లిపాయలు క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడతాయి. ఇది తల, మెడ, పెద్దపేగు క్యాన్సర్ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రతి రోజు మజ్జిగన్నంలో ఉల్లిపాయను భాగంగా చేసుకుంటే ఆస్టియోపోరోసిస్, అథెరోస్క్లెరోసిస్ నుండి రక్షణ కలుగుతుంది. ఉల్లిపాయలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి సహాయ పడతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సలో సహాయపడతాయి. ప్రతి రోజు మజ్జిగన్నంలో ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అంతేకాక మంచి కొలస్ట్రాల్ ను పెంచి గుండె వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.
దంతాల నొప్పి, పిప్పి పన్ను నొప్పి నివారణకు మజ్జిగన్నంలో ఉల్లిపాయ తింటే చాలు. పెరుగన్నంలో లేదా మజ్జిగన్నంలో ఉల్లిపాయను ఉపయోగించటం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక అన్నింటి కన్నా ముఖ్యమైనది మజ్జిగన్నంతో ఉల్లిపాయ తింటే యవ్వనంగా ఎప్పటికీ ఉంటారు. అలాగే పురుషుల్లో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది.