Money : డబ్బు సంపాదించాలని చాలా మంది శత విధాలా ప్రయత్నిస్తుంటారు. కానీ ఈ కలను కేవలం కొందరు మాత్రమే సాకారం చేసుకుంటారు. కొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏం చేసినా కలసి వస్తుంది. రెండు చేతులా డబ్బు సంపాదిస్తారు. కానీ కొందరికి మాత్రం ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. వారు ఏం చేసినా కలసిరాదు. డబ్బు సంపాదించలేకపోతుంటారు. కొందరు సంపాదిస్తారు. కానీ చేతిలో నిలవదు. వృథాగా ఖర్చవుతుంటుంది. అయితే అలాంటి వారు కింది తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఈ తప్పులను చేస్తే.. చేతిలో అసలు డబ్బు నిలవదు. ఆర్థిక సమస్యలు ఎల్లప్పుడూ ఉంటాయి. దరిద్రంలోనే జీవనం సాగిస్తుంటారు. ఎన్నటికీ కోటీశ్వరులు కాలేరు. ఇక ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు ఎల్లప్పుడూ దరిద్రంలోనే ఉండేందుకు గల కారణం.. బాత్ రూమ్‌లను, ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడమే అని చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి రాదు. ఇల్లు, ఇంట్లోని గదులు అన్నీ శుభ్రంగా ఉంటేనే లక్ష్మీ దేవి వస్తుంది. కనుక ఈ తప్పు చేసే వారు దాన్ని ఇప్పుడే మానేయాలి. వెంటనే ఇంటిని, ఇంట్లోని గదులను, ఇంటి పరిసరాలను అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలి. దీంతో లక్ష్మీదేవి సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కోటీశ్వరులు అవుతారు. ఆర్థిక సమస్యలు ఉండవు.
కొందరు పడుకునే మంచంపై కప్పే దుప్పట్లు, దిండ్లు వంటి వాటిని శుభ్రంగా ఉంచరు. ఇలా చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. కనుక వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అలాగే కొందరు ఆహారాన్ని ఎల్లప్పుడూ వృథా చేస్తుంటారు. అవసరమైన దానికన్నా ఎక్కువగా వండడం లేదా తినలేని దానికన్నా ఎక్కువగా పెట్టుకుని తినడం.. తరువాత ఆహారాన్ని మిగిల్చి పడేయడం చేస్తారు. కానీ ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం చెందుతుంది. కనుక ఎంత అవసరమో అంతే వండాలి. ఎంత కావాలో అంతే తినాలి. ఒక వేళ ఆహారం మిగిలితే పేదలకు దానం చేయాలి. అంతేకానీ వృథా చేయరాదు. చేస్తే దరిద్రంలోనే ఉంటారు. ఆస్తిపరులు కాలేరు. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
కొందరు ఉమ్మును ఎక్కడ పడితే అక్కడ వేస్తారు. అలా చేసినా లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతుంది. కనుక కుప్ప తొట్లో లేదా బాత్ రూమ్‌లో ఉమ్మివేయాలి. అలాగే ఇంట్లో ఉత్తరం వైపున నల్లని వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి. ఇవి నెగెటివ్ ఎనర్జీని కలగజేస్తాయి. కనుక ఉత్తరం వైపున వీటిని ఉంచరాదు. ఉంచితే ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. అలాగే ఉత్తరం వైపున బరువైన వస్తువులను కూడా పెట్టరాదు.
ఇక సాయంత్రం సమయంలో ఇంటిని ఊడ్చరాదు. ఉదయమే ఊడ్చాలి. సాయంత్రం ఊడ్చితే పరమ దరిద్రం కలుగుతుందట. అలాగే పెళ్లయిన స్త్రీలు తప్పనిసరిగా నుదుటన సింధూరాన్ని ధరించాలి. ఇంట్లో మద్యం, పొగాకు వంటి పదార్థాలను నిల్వ ఉంచరాదు. అలాగే భర్త సంపాదించి తెచ్చే సొమ్మును భార్య చేతికి ఇచ్చి తరువాత తీసుకుని ఖర్చు పెట్టాలి. భార్య ఆ డబ్బు ఎలా వచ్చిందని భర్తను అడగరాదు. ఇక పెళ్లికాని ఆడపిల్లలు తప్పకుండా నుదుటన బొట్టు పెట్టుకోవాలి. వారు లక్ష్మీదేవికి ప్రతిరూపం అని చెబుతారు. కనుక నుదుటన బొట్టు ఉండాలి. దీంతో దరిద్రం నుంచి బయట పడతారు. కోటీశ్వరులు అవుతారు. ఆర్థిక సమస్యలు పోతాయి. ఈ తప్పులు చేస్తున్న వారు వాటిని గుర్తించి మానేస్తే త్వరగా ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు అవకాశం ఉంటుంది.