lifestyle

Immersion Water Heater : వాట‌ర్ హీట‌ర్‌ను వాడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Immersion Water Heater : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, సేఫ్ గా ఉండాలని, ఏ బాధ లేకుండా ఉండాలని అనుకుంటారు. కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు చెప్పి రావు. ప్రమాదాలు జరగకుండా ముందు నుండి కూడా, జాగ్రత్త వహించాలి. శీతాకాలంలో చల్లటి నీళ్లు తో స్నానం అంటేనే చాలామంది దూరంగా వెళ్ళిపోతారు. శీతాకాలంలో చల్లటి నీటితో స్నానం చేయాలంటే, వణికిపోతుంటారు. ప్రతి ఒక్కరు కూడా, వేడి నీళ్ళని పెట్టుకుని స్నానం చేస్తూ ఉంటారు. ఇదివరకు కట్టెల పొయ్యి మీద వేడి నీళ్లు కాచుకునేవారు. కానీ, ఇప్పుడు గ్యాస్ పొయ్యిల మీద లేదంటే వాటర్ హీటర్లు, గీజర్లు ద్వారా వేడి నీళ్లని పెట్టుకుని స్నానం చేస్తున్నారు.

వేడి నీళ్లు స్నానం చేయడానికి, వాటర్ హీటర్లని ఇప్పటికి కూడా చాలామంది వాడుతున్నారు. అయితే, ఈ హీటర్లు ఉపయోగించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాటర్ హీటర్లు తక్కువ ధరకే దొరుకుతాయి. కనుక, చాలామంది వీటిని కొనుగోలు చేసి వాడుతున్నారు. వాటర్ హీటర్లను ఉపయోగించే సమయంలో నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం కనుక చేసినట్లయితే, చాలా ఇబ్బందిని ఎదుర్కోవాలి. వాటర్ హీటర్లను ఉపయోగించే సమయంలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని, వీటిని పాటించండి.

if you are using immersion water heater then follow these tips

వీటిని పాటించకపోతే, అనవసరంగా మీరు ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది. ఈ నీళ్ళని వేడి చేయడానికి ప్లాస్టిక్ బకెట్లని ఉపయోగించడం మంచిది కాదు. ఇనుము లేదంటే రాగి బకెట్ లని ఉపయోగించండి. ఇలా చేస్తే, షాక్ కొట్టే ప్రమాదం ఎక్కువ ఉండదు.

అలానే, స్విచ్ ఆన్ చేసి ఉన్నప్పుడు నీటిని పట్టుకోవద్దు. పూర్తిగా ప్లగ్గు తీసేసి, ఆ తర్వాత చేతితో చెక్ చేసుకోండి. చాలా మంది, మంచి నీళ్లు వెడక్కయా అని మధ్యలోనే వేలు పెట్టి చూస్తూ ఉంటారు. ఆ తప్పును అస్సలు చేయొద్దు. వాటర్ హీటర్ ఎమర్షన్ రాడ్ పూర్తిగా మునిగిన తర్వాత, స్విచ్ ఆన్ చేయండి. వాటర్ హీటర్లని, బాత్రూంలో వాడకూడదు. చిన్నపిల్లలు ఆడుకునే దగ్గర కూడా ఈ వాటర్ హీటర్లను పెట్టకండి.

Admin

Recent Posts