వినోదం

Devi Putrudu Child Artist : దేవీ పుత్రుడు చిన్నారి పెరిగి ఎంత పెద్ద‌గా అయింది.. గుర్తు ప‌ట్ట‌లేకుండా ఉందిగా..!

Devi Putrudu Child Artist : చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోయిన్స్‌గా స‌త్తా చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే ఇందులో కొంద‌రు అవ‌కాశాలు విరివిగా అందుకుంటున్న మ‌రి కొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ పోరాడుతూనే ఉన్నారు. వారిలో దేవి పుత్రుడు సినిమాలో న‌టించిన బాల న‌టి వేగా తిమోతియా. వెంటేశ్ సౌంద‌ర్య జంట‌గా న‌టించిన దేవి పుత్రుడు సినిమాలో ఈ చిన్నారి త‌న న‌ట‌న‌తో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందింది. ఇప్పుడు పెరిగి పెద్ద‌దై హీరోయిన్ పీస్ మాదిరి మారింది. అవ‌కాశాల కోసం తెగ ప్ర‌య‌త్నిస్తుంది. అయితే చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్స్ ఈ అమ్మ‌డిని ప‌ల‌క‌రించ‌డం లేదు.

దేవి పుత్రుడు సినిమాకు కోడిరామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా 2001లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఈ సినిమా వ‌చ్చి 22 ఏళ్లు దాటింది కాబ‌ట్టి చైల్డ్ ఆర్టిస్ట్ వేగ త‌యోతియా వ‌య‌సు కూడా పెరిగిపోయింది. అంతే కాకుండా ఎంతో అందంగా మారిపోయి కుర్రాళ్ల మ‌న‌సుదోచేస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో న‌టించిన వేగ విదేశాల్లో చ‌దుకుంది. అనంత‌రం ఇండియా వ‌చ్చి 2009లో వ‌రుణ్ సందేశ్ హీరోగా న‌టించిన హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో కీల‌క పాత్ర పోషించింది.

devi putrudu child artist have you seen her now

హ్యాపీ హ్యాపీ సినిమా ఫ్లాప్ కావ‌డంతో ఈ అమ్మ‌డికి పెద్ద‌గా గుర్తింపు అయిత రాలేదు. ఇక ఇదే కాకుండా మ‌రి కొన్ని సినిమాల‌లో కూడా వేగ న‌టించింది. అవి కూడా ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కు గుర్తింపు తెచ్చిపెట్ట‌లేదు. చివ‌రగా 2019లో వేగ త‌మెతియా ఓ వెబ్ సిరిస్ లో న‌టించింది. ఆ త‌ర‌వాత సినిమాల‌కు దూరం అయ్యింది.అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. అయితే ఈ అమ్మ‌డు ఇంత పెద్ద‌ది అవ‌డాన్ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Admin

Recent Posts