ఆధ్యాత్మికం

Teeth : దంతాలు ఊడిపోయిన‌ట్లు క‌ల వ‌చ్చిందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Teeth : ప్రతి ఒక్కరికి నిద్రపోయినప్పుడు కలలు రావడం సహజం. ఏదో ఒక కల మనకి వస్తూ ఉంటుంది. కలలో దెయ్యాలు కనిపించడం, లేదంటే జాబ్ వచ్చినట్లు, లేదంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు, ఇలా ఏదో ఒక కల మనకి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఎవరో చనిపోయినట్లు కూడా మనకి కల వస్తూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి విచిత్రమైన కలలు కూడా వస్తూ ఉంటాయి. నిజానికి ఏదైనా కల వచ్చిందంటే దాని వెనుక ఏదో అర్థం ఉంటుంది.

స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కల వెనుక ఏదో ఒక సంకేతం ఉంటుంది. కలలో కనుక దంతాలు విరగడం కనపడితే దాని వెనుక అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో దంతాలు ఊడిపోయినట్లు కనిపించినట్లయితే దానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మీ దంతాలని పట్టుకున్నట్లు లేదంటే పగలగొట్టినట్లు కనిపించినట్లయితే మీ జీవితంలో ఏదో తప్పు జరగబోతున్నట్లు దానికి అర్థం.

if you dream about teeth loss know what happens

భవిష్యత్తులో పెద్ద మార్పు రాబోతోందని స్వప్న శాస్త్రం చెప్తోంది. నిద్రలో పళ్ళు కొరకడం ఇటువంటి వాటి గురించి కూడా స్టడీ చేశారు. దంతాలు ఊడిపోవడం వంటివి మనకి కలలో కనిపించినట్లయితే నిరాశ, ఆందోళన, నిస్సహాయత, నియంత్రణని కోల్పోవడం వంటివి ఉంటాయని స్టడీ చెప్తోంది.

అలాగే బాగా కావాల్సిన వాళ్ళు రుణం తీరకుండానే చనిపోతే అదే ఆలోచనలో ఉన్నప్పుడు ఇలాంటి కలలు వస్తాయని ఈజిప్షియన్ ఫిలాసఫర్స్ చెప్పడం జరిగింది. అదే విధంగా లైంగిక ఆలోచనలు కానీ లైంగిక భయాలు కానీ ఉన్నట్లయితే కూడా ఇలాంటి కలలు వస్తాయని చెప్పారు. ఇలా మనకి వచ్చే కలల ద్వారా మన లైఫ్ లో ఏం చోటు చేసుకోబోతున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. పళ్ళు ఊడిపోయినట్లు, విరిగిపోయినట్లు, దంతాలు ఎవరో పట్టుకున్నట్లు కలలు వస్తే మాత్రం నిరాశ, ఆందోళన, నిస్సహాయత వంటివి ఉంటాయని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts