Money Problems : ప్రతి ఒక్కరికి, ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. సమస్యలు ఏమి లేకుండా, సంతోషంగా ఉండడం ఎవరికీ సాధ్యం కాదు. చాలామంది, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. మీరు కూడా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా..? ఆ సమస్యల నుండి, బయట పడాలని అనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు, శుక్రవారం నాడు ఇలా చేసినట్లయితే, చక్కటి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
చాలామంది, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటారు. జీతం వచ్చిన వెంటనే డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడం, లోన్ వంటి వాటిని క్లియర్ చేయలేకపోవడం, ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇంటికి దీపం ఇల్లాలు. ఇంట్లో వున్న మహిళలని లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. శుక్రవారం రోజు, స్త్రీలని, బాలికలని అసలు అవమానించకూడదు. వాళ్ల గురించి చెడుగా మాట్లాడకూడదు. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా, స్త్రీలని అవమానించే చోట ఉండదు. కాబట్టి ఆ తప్పు చేయకూడదు.
శుక్రవారం రోజు ప్రశాంతంగా, ఓపిగ్గా ఉండాలి. ఎవరితోనూ అస్సలు అసభ్యకరంగా ప్రవర్తించకూడదు. చెడుగా మాట్లాడకూడదు. చెడు వ్యక్తుల దగ్గర ఉండడానికి లక్ష్మీదేవి అసలు ఇష్టపడదు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. శుక్రవారం నాడు చక్కెరని అప్పుగా ఇవ్వకూడదు. చక్కర ని కనుక, శుక్రవారం అప్పుగా ఇచ్చినట్లయితే, ఐశ్వర్యం పోతుంది.
సో, శుక్రవారం నాడు, ఎవరికీ డబ్బులని అప్పుగా ఇవ్వడం కూడా మంచిది కాదు. శుక్రవారం నాడు మద్యం, మాంసం కూడా తీసుకోకూడదు. ఇలా, ఈ తప్పులు చేయకుండా మీరు చూసుకున్నట్లయితే, లక్ష్మీదేవి మీ వెంట కొలువై ఉంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. సంతోషంగా ఉండొచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట నిత్యం కొలువై ఉంటుంది. ఈసారి ఈ తప్పులు జరగకుండా చూసుకోండి. అప్పుడు ఆర్థిక బాధలు ఏమీ ఉండవు.