ఆధ్యాత్మికం

Money Problems : ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా చేశారంటే ఏ సమస్యా ఉండదు..!

Money Problems : చాలామంది, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు. ఉండిపోమంటే లక్ష్మీదేవి మన ఇంట ఉండదు. లక్ష్మిదేవి, మన వెంట కొలువై ఉండాలంటే, కచ్చితంగా వాస్తు చిట్కాలను పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం మనం పాటించినట్లయితే, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. చాలామంది, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్న, సంపద మన ఇంట కొలువై ఉండాలన్నా, వాస్తు ప్రకారం పాటించడం మంచిది. వాస్తు ప్రకారం, లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే, ఇలా చేయడం మంచిది. ఉదయం నిద్ర లేచిన వెంటనే తలుపులు, కిటికీలు ఓపెన్ చేయాలి.

ముఖ్యంగా, సూర్యోదయం తర్వాత ఇలా చేయడం వలన, సూర్యకిరణాలు ఇంట్లో పడతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. ప్రశాంతంగా ఇల్లు మారిపోతుంది. లక్ష్మీదేవి కూడా, ఇంట కొలువై ఉంటుంది. అలానే, వాస్తు ప్రకారం చీపురులో లక్ష్మీదేవి ఉంటుంది. చీపురుని సరైన దిశలో పెడితే, ఇంట్లో ఎంతో మంచి కలుగుతుంది. చీపురుని ఇంటికి వచ్చేవారు, చూడకుండా పెట్టాలి.

if you have money problems then do like this

చీపురుని బహిర్గతమైన ప్రదేశాలలో పెట్టకూడదు. కాళ్ళకి తగిలే విధంగా కూడా చీపురుని పెట్టకూడదు. వాస్తు ప్రకారం, లక్ష్మీదేవి శుభ్రమైన చోట మాత్రమే ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే, లక్ష్మీదేవి అక్కడ నివసించదు. లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, అన్నపూర్ణని రోజు పూజించాలి.

ఒక గిన్నెలో అన్నం ఉంచి, దానిమీద అన్నపూర్ణ విగ్రహాన్ని ఉంచాలి. ఇలా చేస్తే, ధనం ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం, పూజ గదిలో వలంపురి శంఖాన్ని పెట్టాలి. ఇలా చేస్తే కూడా, లక్ష్మీదేవి ఇంట కొలువై ఉంటుంది. చూశారు కదా లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలంటే ఏం చేయాలి అనేది. మరి, ఇలా చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఆర్థిక బాధల నుండి దూరంగా ఉండండి.

Admin

Recent Posts