ఆధ్యాత్మికం

పొరపాటున శివుడికి ఈ వస్తువులను సమర్పిస్తే కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే..!

త్రిమూర్తులలో ఒకరైన ఆ పరమేశ్వరుడి ప్రతిరూపమే శివలింగం. భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని పూజిస్తే తప్పకుండా వారి కోరికలను నెరవేరుస్తాడు. అయితే ఆ పరమశివుడి ప్రతిరూపమైన శివలింగాన్ని పూజించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ క్రమంలోనే మనకు తెలియకుండా శివుడికి కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని పండితులు చెబుతున్నారు. మరి శివుడికి సమర్పించకూడని ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందామా..!

అన్ని పూజలలో మనం పసుపును ఉపయోగిస్తాము. కానీ శివపూజలో పసుపును ఉపయోగించకూడదు. పసుపు స్త్రీల అందాన్ని రెట్టింపు చేస్తుంది. కానీ శివలింగం పరమేశ్వరుడి ప్రతిరూపం కనుక శివపూజలో ఉపయోగించకూడదని శివపురాణం తెలుపుతోంది. శివ పూజలో పొరపాటున కూడా తులసి ఆకులను సమర్పించకూడదు. శివ పూజలో కేవలం మారేడు దళాలను మాత్రమే ఉపయోగించాలి.

if you offer these items to lord shiva then you will get problems

కొబ్బరికాయను శివలింగం ముందు కొట్టవచ్చు కానీ ఆ కొబ్బరి నీళ్లను స్వామి వారిపై పోయకూడదు. పరమేశ్వరుడికి తెల్లటి పుష్పాలతో పూజ చేయడం వల్ల స్వామి వారు ఎంతో ప్రీతి చెందుతారు. కానీ చంపా పుష్పాలు తెలుపు రంగులో ఉన్నప్పటికీ స్వామి పూజకు అనర్హం. ఎందుకంటే చంపా పుష్పాలను శివుడు శపించడం వల్ల ఆయన పూజకు ఉపయోగించకూడదు. శివలింగానికి ఎప్పుడూ కుంకుమ తిలకం వాడకూడదు. ఈ విధమైన నిబంధనలను జాగ్రత్తగా పాటించి శివుడికి పూజ చేయడం వల్ల తప్పకుండా స్వామివారి అనుగ్రహం మనపై కలుగుతుంది.

Admin

Recent Posts