Chicken Tikka : చికెన్‌తో మనం అనేక రకాల వంటకాలను చేసుకుని తినవచ్చు. చికెన్ బిర్యానీ, కూర, వేపుడు, పులావ్.. ఇలా చికెన్‌తో ఏ వంటకం చేసినా అద్భుతంగానే ఉంటుంది. అయితే చికెన్‌తో మనం చికెన్ టిక్కా కూడా చేసుకుని తినవచ్చు. సాధారణంగా ఈ డిష్ మనకు రెస్టారెంట్లలోనే లభిస్తుంది. కానీ కొంచెం శ్రమపడితే ఇంట్లోనే ఘుమ ఘుమలాడే చికెన్ టిక్కా తయారు చేసుకుని దాని రుచిని ఆస్వాదించవచ్చు. మరి చికెన్ టిక్కాను ఎలా తయారు చేయాలో, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
చికెన్ టిక్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ ముక్కలు (బోన్‌లెస్) – 1/2 కిలో, శనగపిండి – ఒకటిన్నర టేబుల్ స్పూన్, పెరుగు – 1 కప్పు, కారం – 1 టీస్పూన్, మిరియాల పొడి – 1/2 టీస్పూన్, గరం మసాలా – 1/2 టీస్పూన్, పసుపు – 1/4 టీస్పూన్, ఉప్పు – తగినంత, ధనియాల పొడి – 1/2 టీస్పూన్, కసూరీ మేథీ – 3/4 టీస్పూన్, నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా – 1/2 టీస్పూన్.
చికెన్ టిక్కా తయారు చేసే విధానం..
పైన చెప్పిన పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఆ గిన్నెను ఫ్రిజ్‌లో 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంతో ఆ మిశ్రమమంతా చికెన్ ముక్కలకు బాగా పడుతుంది. చికెన్ బాగా మారినేట్ అవుతుంది. అనంతరం ఆ ముక్కలను తీసి ఇనుప చువ్వలకు గుచ్చి వాటిని నిప్పుల మీద కాల్చుకోవాలి. అంతే.. ఘుమాళించే చికెన్ టిక్కా తయారవుతుంది.