food

రుచికరమైన తోటకూర వేపుడు తయారీ విధానం..!

తాజా ఆకు కూరలలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకుకూరలను తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరి ఎన్నో పోషక విలువలు కలిగిన తోటకూర వేపుడు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

తాజా తోటకూర రెండు కట్టలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు పది, కారం టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు, పప్పుల పొడి రెండు టేబుల్ స్పూన్లు, నూనె తగినంత, శనగపప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, ఉప్పు తగినంత, కొద్దిగా నీరు.

thotakura vepudu recipe in telugu

తయారీ విధానం

ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ మీద కడాయి ఉంచి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇది కొద్దిగా ఎరుపు రంగులోకి రాగానే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు ఎర్రపడ్డాక అందులోకి ముందుగా తరిగిపెట్టుకున్న తోట కూర వేసి బాగా కలియబెట్టాలి. కాసేపు మూత పెట్టి ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీటిని వేసి తగినంత ఉప్పు వేసి మరోమారు కలియబెట్టి మూత పెట్టాలి. ఇలా చేయటంవల్ల ఆకు తొందరగా మెత్తబడుతుంది.ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలియబెట్టి చిటికెడు పసుపు వేసి ఉడికించాలి.నీరు మొత్తం ఇంకిపోయిన తరువాత కారం వేసి సిమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు వేయించాలి.కారం బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి, పప్పుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన తోటకూర వేపుడు తయారైనట్లే. ఈ తోటకూర వేపుడు చపాతీ పూరీ వంటివాటిలో తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది.

Admin

Recent Posts