Chapati And Dosa : చాలా మంది, రాత్రిపూట కూడా టిఫిన్ వంటి వాటిని చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా రాత్రి పూట చపాతీ, దోసె వంటిది తింటూ ఉంటారు. ఉదయం అల్పాహారం సమయంలో కూడా దోసె, చపాతి వంటివి చాలామంది తింటూ ఉంటారు. అయితే, చపాతీలు, దోసె ఎందుకు గుండ్రంగా ఉంటాయి..? దాని వెనక కారణం ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఎప్పుడు చేసినా మనం వాటిని గుండ్రంగానే చేస్తాము. ఇవి ఎందుకు గుండ్రంగా ఉండాలి..? దీని వెనక కథ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
చపాతీ గుండ్రంగా ఉండడానికి ముఖ్యమైన కారణం, పిండిని మనం రోల్ చేసినప్పుడు ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా ఆకారంలో చుట్టాలంటే కష్టంగా ఉంటుంది. కానీ, గుండ్రంగా మనం ఒత్తుకోవాలంటే ఈజీగా ఉంటుంది. పైగా మరో కారణమేంటంటే, చపాతీలు లేదంటే దోస వంటివి గుండ్రంగా ఉండడం వలన ఏమవుతుంది అంటే, అన్ని వైపులా కూడా సమానంగా ఇవి కాలుతాయి. చక్కగా టేస్టీగా ఉంటుంది.
ఒకవైపు కాలకుండా, ఇంకో వైపు కాలిపోయి ఇలా ఉండదు. సమానంగా అన్ని వైపులా కూడా కాలుతుంది. సో, ఇది ఒక ప్రయోజనం. ఇక సైంటిఫిక్ పరంగా చూసినట్లయితే, మెదడుకి ముఖ్యంగా మన కళ్ళకి పదునైన అంచులు కంటే, సర్కిల్ ని గుర్తించడం ఈజీ. గుండ్రంగా ఉండే వస్తువులు చూడడానికి ఈజీగా ఉంటాయి.
అందువలన వాటిని మనం ఈజీగా వాడుకోవచ్చు. వత్తేటప్పుడు కూడా గుండ్రంగా ఉన్న వాటిని, మనం ఈజీగా చేసుకోవచ్చు. పైగా గుండ్రంగా ఉండేవి అతి తక్కువ ప్రకాశవంతంగా కనబడతాయి. అందువలన గమనించడానికి కంటికి హాని కలగదు. ఈ లాజిక్ ఏ ఈ ఆహార పదార్థాలుకు కూడా ఉపయోగించి ఉండవచ్చు.