vastu

ఇంటి మేడపై ఈ వస్తువులను పెడుతున్నారా ? అయితే కష్టాలు తప్పవు!

సాధారణంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను కొన్నిచోట్ల అసలు ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా ఉంచడం వల్ల ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆర్థిక సమస్యలతో సతమతమవుతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ విధమైన సమస్యలు లేకుండా సుఖంగా ఉండాలంటే మన ఇంటి మేడ పై భాగంలో పాత సామాన్లను ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు పై పనికిరాని పాత సామాన్లను ఉంచడం వల్ల ఆ వస్తువులు అధిక మొత్తంలో పరిసర ప్రాంతాల నుంచి నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటాయి. ఈ క్రమంలోనే ఆ ఇంటిపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావం పడటం వల్ల మన ఇంట్లో అనేక సమస్యలు ఎదురవుతాయని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కేవలం ప్రతికూల వాతావరణ పరిస్థితుల ఏర్పడటమే కాకుండా పితృ దోషం కూడా ఉంటుంది.

if you put these items on your home rooftop then beware

అందుకోసమే ఇంటి పై భాగంలో ఎలాంటి పరిస్థితులలో కూడా పాత సామాన్లను, విరిగిపోయే వస్తువులను వేయకూడదు. ఇలా వేయడం వల్ల మన ఇంట్లో మానసిక అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఇంటి పై భాగంలో ఎప్పుడూ కూడా పాత సామాన్లువేయకూడదని ఒకవేళ వేసి ఉంటే వెంటనే వాటిని తొలగించాలని చెబుతున్నారు.

Admin

Recent Posts