వినోదం

మ‌హేష్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెట్ట‌డం ఖాయం..

నాలుగు పదుల వయసు దాటినా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబు అందానికి ఎంతటి వారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా మహేష్ బాబు మెసేజ్ ఒరియంటెడ్ చిత్రాలలో ఎక్కువగా నటిస్తున్నారు.

భరత్ అనే నేను సినిమాతో మొద‌లు పెడితే.. మ‌హర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు, స‌ర్కారు వారి పాట‌ మొత్తంగా 4 చిత్రాలు వ‌రుస‌గా హిట్ అయ్యాయి. ప్రేక్షకులకు వినోదంతో పాటు మెసేజ్ అందిస్తున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు బాగా హల్చల్ చేస్తున్నాయి.

mahesh babu net worth and assets details

ఇప్పటివరకు మహేష్ బాబు యాడ్స్ లోను మరియు సినిమాలో నటిస్తూ ఎంత ఆస్తిని సంపాదించి ఉంటాడు అనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. ఓ ఇంగ్లీష్ వెబ్ సైట్ కథనం ప్రకారం… మహేష్ బాబు ఆస్తుల విలువ 32 మిలియన్ డాలర్ల పై మాటే అని తెలుస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.244 కోట్ల వరకూ మహేష్ బాబు ఆస్తులు విలువ ఉందని తెలుస్తోంది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో మహేష్ బాబుకి విలాసవంతమైన విల్లా ఉంది. దాని ధర దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని సమాచారం వినిపిస్తుంది. అదేవిధంగా బెంగళూరులో కూడా మహేష్ బాబుకు కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నట్టు సమాచారం.

మహేష్ బాబు వద్ద అనేక లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. మహేష్ బాబు వద్ద ఉన్న లంబోర్ఘిని కారు విలువ రూ.3 కోట్లు ఉంటుంది. ఈ కారు మాత్రమే కాకుండా రూ.90 లక్షల విలువచేసే టయోటా ల్యాండ్ క్రూయిజర్ , 49 లక్షల విలువచేసే బెంజ్ కారు, రేంజ్ రోవర్ కార్, ఆడి కార్లు కూడా మహేష్ వద్ద ఉన్నాయి. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.55 నుండి రూ.65 కోట్ల వరకు రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాడ్స్ కోసం మహేష్ బాబు ఏకంగా రూ.8 కోట్ల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Admin

Recent Posts