vastu

Money : ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిల‌వ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!

Money : చాలామంది ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఎంతో కష్ట పడి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అయినా కూడా ఒక్క‌ రూపాయి కూడా చేతిలో నిలవదు. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిని కనుక మీరు పాటించారంటే కచ్చితంగా మీ ఇంట్లో ధనలక్ష్మి ఉంటుంది. ఆర్థిక బాధలు ఉండవు. డబ్బులు మీ ఇంట్లోనే ఉంటాయి. ఎక్కడికి డబ్బులు వెళ్లి పోవు.

నిజానికి ఇంట్లో ఉన్న సానుకూల శక్తి, ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అలానే ఇంట్లో వారి ఆరోగ్యం, ఆనందం కూడా ఈ పాజిటివ్ ఎనర్జీతో ముడిపడి ఉంటుంది. అందుకే ఇంట్లో సరైన వాస్తు ఉండడం చాలా అవసరం. అలా వాస్తు ప్రకారం పాటిస్తే పేదరికాన్ని తరిమికొట్టొచ్చు. సిరిసంపదలతో ఉండొచ్చు. ఇంట్లో నెమలి ఈకని తెచ్చి పెట్టుకోవడం వలన ఆనందం కలుగుతుంది. శ్రేయస్సుకి చిహ్నంగా నెమలి ఈకని భావిస్తారు. దీని వలన డబ్బుకి ఎటువంటి లోటు కూడా ఉండదు.

if you want to get rid of economical problems then do like this

వాస్తు దోషాలు అన్నీ కూడా పోతాయి. సంపద ఉన్న చోట మీరు మూడు నెమలి ఈకలని ఉంచండి. అప్పుడు కచ్చితంగా మీ సంపద పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడింది. ఇంట్లో తాబేలు ఉంటే కష్టాలు, సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. తాబేలుని ఉంచడం వలన అభివృద్ధి కనపడుతుంది. లక్ష్మీదేవి చిత్రం ఇంట్లో ఉంటే డబ్బుకి లోటు ఉండదు. లక్ష్మీదేవి ఫోటోని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ ఉంచండి. దీనివలన మీ ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆర్థిక బాధలు ఉండవు.

వాస్తు ప్రకారం లోహపు ఏనుగుని ఇంట్లో ఉంచడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏనుగు చిత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టండి. అయితే ఏనుగు తొండం కిందకి పెట్టి ఉండేలా చూసుకోండి. శంఖాన్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోండి. శంఖానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం. శంఖాన్ని మీరు ఇంట్లో ఉంచితే డబ్బుకి అసలు లోటే ఉండదు.

Admin

Recent Posts