technology

మీ ఫోన్ చాలా నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుందా ? అయితే కార‌ణాలు తెలుసుకోండి.. స‌మ‌స్య‌ను ఇలా ప‌రిష్క‌రించుకోండి..!

స్మార్ట్ ఫోన్లు మ‌న‌కు అనేక ర‌కాలుగా ఉపయోగ‌ప‌డుతున్నాయి. అది మ‌న చేతిలో ఉంటే చిన్న‌పాటి కంప్యూట‌ర్ ఉన్న‌ట్లే. అందువ‌ల్ల ఫోన్లు కూడా అప్పుడ‌ప్పుడు నెమ్మ‌దిగా ప‌నిచేస్తాయి. ఇక కొన్ని ఫోన్ల‌కు చార్జింగ్ చాలా నెమ్మ‌దిగా అవుతుంది. అయితే అందుకు గ‌ల కార‌ణాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

* చార్జింగ్ పెట్టే కేబుల్ లో లోపం ఉన్నా ఫోన్ నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుంది.

* విద్యుత్ స‌ర‌ఫ‌రాలో హెచ్చు త‌గ్గులు ఉంటే చార్జింగ్ స‌రిగ్గా అవ‌దు.

* చార్జింగ్ పెట్టే అడాప్ట‌ర్ పాడైనా చార్జింగ్ నెమ్మ‌దిగా అవుతుంది, లేదా అస‌లు చార్జింగ్ అవ‌దు.

if your smart phone is charging slowly then do like this

* బ్యాట‌రీ స‌మ‌స్య ఉన్నా ఫోన్ స్లో గా చార్జింగ్ అవుతుంది.

* ఫోన్‌లో ఏవైనా యాప్స్ బ్యాట‌రీని బాగా వినియోగించుకుంటున్నా చార్జింగ్ నెమ్మ‌దిగా అవుతుంది.

* ఫోన్‌కు చెందిన యూఎస్‌బీ పోర్టు దెబ్బ తిన్నా, తుప్పు వ‌చ్చినా ఫోన్ నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుంది.

పైన తెలిపిన కార‌ణాల వ‌ల్ల ఫోన్ నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుంది. ఒక్కో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటూ వ‌స్తే అస‌లు ఫోన్ ఎందుకు నెమ్మ‌దిగా చార్జింగ్ అవుతుందో ఇట్టే తెలిసిపోతుంది. దీంతో అస‌లు కార‌ణం తెలుసుకుని సుల‌భంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో ఫోన్‌ను వేగంగా చార్జింగ్ అయ్యేలా చేయ‌వ‌చ్చు.

Admin

Recent Posts