food

ఘుమ ఘుమలాడే మ‌ట‌న్ దాల్ ఘోస్ట్..ఇలా చేయండి..!

మ‌ట‌న్‌, ప‌ప్పు దినుసులు.. రెండింటిలోనూ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ రెండింటిలో దేన్ని తిన్నా మ‌న‌కు ప్రోటీన్లు అందుతాయి. శ‌రీర నిర్మాణం జ‌రుగుతుంది. అయితే ఈ రెండింటినీ క‌లిపి వండుకుని కూడా తిన‌వచ్చు. దీంతో మ‌న శ‌రీరానికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది. పిల్ల‌ల‌కు అయితే ఇలా మ‌ట‌న్‌, ప‌ప్పు రెండింటినీ క‌లిపి వండి పెడితే వారికి బాగా బ‌లం వ‌స్తుంది. అన్ని అంశాల్లోనూ రాణిస్తారు. ఈ క్ర‌మంలోనే మ‌ట‌న్‌, పప్పు దినుసులు రెండింటినీ క‌లిపి చేసే మ‌ట‌న్ దాల్ ఘోస్ట్‌ను ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

మ‌ట‌న్ దాల్ ఘోస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

మసూర్‌దాల్ – కప్పు, బోన్‌లెస్‌ మటన్ – 1 కిలో, ఉప్పు – త‌గినంత, కారం – త‌గినంత, నూనె – 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు – 2, అల్లం ముద్ద – 1 టేబుల్ స్పూను, వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి – 1 టీస్పూను, ధ‌నియాల పొడి – 1 టీస్పూను, పసుపు – 1/2 టీస్పూను, గరం మసాలా – 1 టీస్పూను, నిమ్మకాయ – 1, కొత్తిమీర తురుము – అలంకరణ కోసం.

mutton dal gosht how to make it recipe in telugu

మ‌ట‌న్ దాల్ ఘోస్ట్ త‌యారు చేసే విధానం:

ప్రెష‌ర్ కుక్క‌ర్ తీసుకుని అందులో మ‌ట‌న్ ముక్క‌లు, ప‌ప్పు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిపాయ‌ల‌ను వేసి వాటిని గోల్డ్ క‌ల‌ర్‌లోకి వ‌చ్చేంత వ‌ర‌కు బాగా వేపుకోవాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి ముద్ద‌ల‌ను కూడా వేసి ఒక నిమిషం పాటు బాగా వేపుకోవాలి. అనంత‌రం అందులో ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర‌పొడి, కారం, గ‌రం మ‌సాలా వేసి నూనె తేలే వ‌ర‌కు వేయించుకోవాలి. అనంత‌రం అందులో ప‌ప్పు, మ‌ట‌న్ ముక్క‌ల మిశ్ర‌మం క‌లిపి 10 నిమిషాల పాటు స్ట‌వ్‌ను సిమ్‌లో ఉంచి బాగా ఉడికించాలి. అనంత‌రం నిమ్మ‌ర‌సం పిండి పైన కొత్తిమీర‌తో అలంక‌రించుకోవాలి. దీంతో ఘుమ ఘుమ‌లాడే మ‌ట‌న్ దాల్ ఘోస్ట్ త‌యార‌వుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీలలో తిన‌వ‌చ్చు. భ‌లే రుచిగా ఉంటుంది..!

Admin

Recent Posts