వినోదం

Indraja : ఒక్క జ‌బ‌ర్ధ‌స్త్ ఎపిసోడ్‌కి ఇంద్ర‌జ తీసుకునే పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Indraja : అల‌నాటి అందాల తార‌ల‌లో ఇంద్ర‌జ ఒక‌రు. అందం, అభిన‌యం ఉన్న ఈ న‌టి తెలుగులో టాప్‌ హీరోలందరి సరసన నటించిమెప్పించింది. పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మ‌డు ఇప్పుడు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అలాగే కొన్ని టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. శ్రీదేవి డ్రామా కంపెనీ జ‌డ్జ్‌గా మొద‌ట్లో అల‌రించిన ఇంద్ర‌జ ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ షో కి జ‌డ్జ్‌గా ఉంది. ఇప్పుడు ఆమె ఈషోకి తీసుకునే రెమ్యున‌రేష‌న్ వైర‌ల్‌గా మారింది.

గ‌తంలో రోజా, నాగ‌బాబులు ఒక్కో ఎపిసోడ్ కు రూ.5ల‌క్ష‌లు తీసుకుంటే ఇంద్ర‌జ‌కు కాస్త త‌క్కువే ఇస్తున్నారు. ఆమెకు ఒక్కో ఎపిసోడ్ కు 2 లక్షల 50 వేలు ఇస్తున్నారు. ఇదే రెమ్యున‌రేష‌న్‌ను శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా ఇస్తున్నారంట ఇంద్ర‌జ క్రేజ్‌కి ఇది చాలా త‌క్కువ అని ఆమె అభిమానులు అంటున్నారు. అయితే ఇంద్ర‌జ‌కి ఆ స్థానం రోజా వ‌లనే ద‌క్కింది. జబర్దస్త్ జడ్జ్‌గా కొన్నేళ్ల పాటు సేవలందించింది రోజా. ఓ వైపు రాజకీయాల్లో భాగమవుతూనే వారం వారం కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్‌తో ప్రతి ఇంటి గడప తొక్కేది. అయితే ఆమెకు మంత్రి పదవి రావడంతో ఈ షో నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చి చేరింది.

indraja remuneration per episode of jabardasth

రోజా వస్తే.. జబర్దస్త్ జడ్జ్ సీటు నుంచి లేచి వెళ్ళిపోతా అనేసింది ఇంద్రజ. జబర్దస్త్ వేదికపై రోజా గారు తొమ్మిదేళ్లుగా ఒక లెగసీ క్రియేట్ చేశారని, ఆ తర్వాత మంత్రిగా అవకాశం రావడంతో వెళ్లారని చెప్పింది ఇంద్రజ. ఇక ఇంద్రజ భర్త పేరు మహ్మద్ అబ్సర్. అతను ఓ ముస్లిం అబ్బాయి. 2006లో వీరి వివాహమైంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరి మధ్య స్నేహం చిగురించి.. ఆతర్వాత ప్రేమగా మారింది. ఆపై ఇరు కుటుంబ సభ్యులు, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారు.

Admin

Recent Posts