Instant Coconut Burfi : కొబ్బ‌రితో ఇన్‌స్టంట్‌గా ఇలా 15 నిమిషాల్లోనే స్వీట్‌ను చేసుకోవ‌చ్చు.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..!

Instant Coconut Burfi : ప‌చ్చి కొబ్బ‌రిని కూడా మం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. ప‌చ్చి కొబ్బ‌రి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ప‌చ్చికొబ్బ‌రితో ప‌చ్చ‌డి చేయ‌డంతో పాటు దీనితో మ‌నం తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. ప‌చ్చికొబ్బ‌రితో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన తీపి వంట‌కాల్లో కొకోన‌ట్ బ‌ర్పీ కూడా ఒక‌టి. ఈ తీపి వంట‌కం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా ఉంటుంది. దీనిని 15 నుండి 20 నిమిషాల వ్య‌వ‌ధిలోనే చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కొకోన‌ట్ బర్ఫీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొకోన‌ట్ బ‌ర్ఫీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి – ఒక కొబ్బ‌రి కాయ, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, యాల‌కుల పొడి – అర టీ స్పూన్, పంచ‌దార – అర క‌ప్పు.

Instant Coconut Burfi recipe in telugu make like this
Instant Coconut Burfi

కొకోన‌ట్ బ‌ర్ఫీ త‌యారీ విధానం..

ముందుగా కొబ్బ‌రికాయ‌లో ఉండే కొబ్బ‌రిని తీసుకుని దానిపై ఉండే న‌ల్ల‌టి భాగాన్ని తీసివేయాలి. త‌రువాత ఈ కొబ్బ‌రిని ముక్క‌లుగా చేసుకుని జార్ లో వేసుకోవాలి. త‌రువాత దీనిని మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడ‌య్యాక మిక్సీ ప‌ట్టుకున్న కొబ్బ‌రిని వేసి క‌లుపుతూ వేయించాలి. దీనిని పొడి పొడిగా అయ్యి కొద్దిగా రంగు మారే వ‌ర‌కు వేయించిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత పంచ‌దార వేసి క‌ల‌పాలి. పంచ‌దార క‌రిగిన త‌రువాత కొబ్బరి మిశ్ర‌మం కొద్దిగా ప‌లుచ‌గా మారుతుంది. మ‌ర‌లా దీనిని ద‌గ్గ‌ర ప‌డే వ‌ర‌కు క‌లుపుతూ వేయించాలి.

త‌రువాత మ‌రో అర టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని పైన స‌మానంగా చేసుకోవాలి. త‌రువాత దీనిని పూర్తిగా చ‌ల్లారే వ‌ర‌కు అలాగే ఉంచాలి. త‌రువాత మ‌న‌కు కావ‌ల్సిన ఆకారంలో క‌ట్ చేసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కొకోన‌ట్ బ‌ర్ఫీ త‌యార‌వుతుంది. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా అప్ప‌టిక‌ప్పుడు ప‌చ్చి కొబ్బ‌రితో రుచిక‌ర‌మైన బ‌ర్ఫీని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts