Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కోలుకున్న విషయం విదితమే. ఆయన హాస్పిటల్‌లో ఉన్న సమయంలోనే ఆయన నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయింది. అయితే హాస్పిటల్ నుంచి వచ్చాక సాయిధరమ్ తేజ్ బయట అసలు కనిపించలేదు. ఆయన తరువాత సినిమా కూడా ప్రారంభించలేదు. ఒకటి రెండు సార్లు మెగా ఫ్యామిలీ వేడుకల్లో కనిపించారు. అయితే ఆయన మొట్ట మొదటి సారిగా బయటకు వచ్చారు.
ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుని కోలుకున్న తరువాత సాయి ధరమ్ తేజ్ ఇంటికే పరిమితం అయ్యాడు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఈ మధ్య కాలంలో చాలా వార్తలు వచ్చాయి. అయితే ఆయన తాజాగా బయటకు వచ్చారు. అనేక రోజుల తరువాత ఆయన ఆరోగ్యంగా కనిపించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన సోమవారం విజయవాడకు వచ్చారు. అక్కడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను దర్శించుకున్నారు.
దుర్గమ్మను సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తేజ్ కుటుంబానికి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు, ఆయన కుటుంబానికి ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే పట్టువస్త్రాలు, ప్రసాదం ఇచ్చారు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ.. తాను ఎప్పుడు విజయవాడ వచ్చినా దుర్గమ్మను దర్శించుకుంటానని, చాలా ప్రశాంతంగా దర్శనం అయిందని తెలిపాడు. ఇక త్వరలోనే తేజ్ కొత్త సినిమా ప్రారంభం కానుంది.