Rohit Sharma : భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం విజయాల బాటలో నడుస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న భారత్ ఆ జట్టుతో టీ20 సిరీస్‌ను కూడా అలాగే ఆడుతోంది. మొదటి టీ20లో భారత్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ప్రస్తుతం భారత జట్టు విండీస్‌తో తలపడుతోంది. అయితే సోషల్ మీడియాలో రోహిత్ శర్మ గురించి ఓ వింతైన ప్రశ్న వైరల్ అవుతోంది. అదేమిటంటే..
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి బాలీవుడ్ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్న విషయం విదితమే. వీరికి ఒక కుమార్తె జన్మించగా.. ఆమెకు వామికా అని పేరు పెట్టుకున్నారు. ఇక అనుష్క శర్మ పేరు చివర, రోహిత్ శర్మ పేరు చివర.. శర్మ అని ఉంటుంది. దీంతో అనుష్క శర్మకు రోహిత్ శర్మ సోదరుడు అవుతాడా ? అని ఒక ప్రశ్న ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అయితే వాస్తవానికి ఇలా పేర్ల చివర్లో చాలా మందికి శర్మ ఉంటుంది. అంతమాత్రం చేత వారు రక్త సంబంధీకులు అయిపోరు. బాలీవుడ్‌లో చాలా మందికి కపూర్ అని ఉంటుంది. కానీ వేర్వేరు ఫ్యామిలీలు ఉన్నాయి. అలా చాలా మంది పేరు చివర్లలో ఒకే రకంగా ఉంటాయి. అంత మాత్రం చేత అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు అనుకోకూడదు. అయినప్పటికీ కొందరు ఈ ప్రశ్నను వైరల్ చేస్తున్నారు.
ఇక దీనికి చాలా మంది ఫన్నీగా సమాధానాలు చెబుతున్నారు. అవును.. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, సందీప్ శర్మ, మోహిత్ శర్మ, అనుష్క శర్మ.. వీరందరూ కజిన్స్.. అని కొందరు కామెంట్లు చేయగా.. శిఖర్ ధావన్, రిషి ధావన్, వరుణ్ ధావన్.. వీరు ముగ్గురూ అన్నదమ్ములు.. అని ఇంకొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు చాలా మంది రకరకాలుగా సమాధానాలు చెబుతున్నారు.