OnePlus TV : వన్‌ప్లస్ సంస్థ వై1ఎస్ సిరీస్‌లో పలు నూతన స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. వీటిల్లో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే ఈ స్మార్ట్ టీవీల ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. వన్‌ప్లస్ వై1ఎస్, వై1ఎస్ ఎడ్జ్ మోడల్స్‌లో 32, 43 ఇంచుల డిస్‌ప్లే సైజ్‌లతో వన్‌ప్లస్ సదరు టీవీలను లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్ టీవీలలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ టీవీ 11 ఓఎస్, గూగుల్ అసిస్టెంట్ బిల్టిన్, వైఫై, బ్లూటూత్ 5.0, డాల్బీ ఆడియో తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
ఇక వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ 32 ఇంచుల టీవీ ధర రూ.16,499 ఉండగా, వై1ఎస్ 43 ఇంచుల టీవీ ధర రూ.26,999గా ఉంది. అలాగే వన్‌ప్లస్ టీవీ వై1ఎస్ ఎడ్జ్ 32 ఇంచుల టీవీ ధర రూ.16,999గా ఉంది. ఇదే మోడల్‌కు చెందిన 43 ఇంచుల వేరియెంట్ ధర రూ.27,999గా ఉంది.
ఈ స్మార్ట్ టీవీలపై పలు లాంచింగ్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు కార్డులతో రూ.2000. రూ.2500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈఎంఐ సదుపాయం కూడా లభిస్తోంది.