Son of India Movie Review : మోహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం.. సన్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తనికెళ్ల భరణి, నరేష్, అలీ, వెన్నెల కిషోర్, పృథ్వీ రాజ్, రఘు బాబు, రాజా రవీంద్ర, రవి ప్రకాష్ లు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
ఒక ప్రముఖ కేంద్ర మంత్రి, ఒక ప్రముఖ డాక్టర్, ఒక ప్రముఖ ప్రభుత్వ ఉద్యోగి.. ఇలా వీరిని ఒక వ్యక్తి కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఎన్ఐఏ ఆఫీసర్ (ప్రగ్యా జైస్వాల్) రంగంలోకి దిగుతుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఆమెకు కిడ్నాప్ చేసిన వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్‌లో గతంలో పనిచేసిన ఓ డ్రైవర్ (మోహన్ బాబు) ఈ కిడ్నాప్‌లకు కారణం అని తెలుస్తుంది. దీంతో సదరు అధికారిణి కేసును ఎలా ఛేదించింది ? ఆ డ్రైవర్‌ను పట్టుకోగలిగిందా ? అసలు ఆ డ్రైవర్ ఎవరు ? అతని ఫ్లాష్ బ్యాక్ ఏమిటి ? ఎందుకు కిడ్నాప్‌లు చేశాడు ? వంటి వివరాలను తెలుసుకోవాలంటే.. ఈ మూవీని వెండితెరపై చూడాల్సిందే.
మోహన్ బాబు సీనియర్ నటుడు. కనుక ఆయన పెర్ఫార్మెన్స్‌కు పేరు పెట్టాల్సిన పనిలేదు. సినిమాలో ఆయన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. అలాగే ఇతర పాత్రల్లోని నటీనటులు కూడా వారి పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.
అయితే సినిమా మొత్తం కేవలం మోహన్‌బాబు చుట్టే తిరుగుతుంది. దీంతో ఇతర నటీనటుల పాత్రలకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. అలాగే కథ మంచిదే అయినా.. దాన్ని తెరకెక్కించడం బాగా లేదు. కొన్ని చోట్ల సీన్లు పాత తరం సినిమాలను తలపిస్తాయి. కథ మంచిగానే ఉన్నా.. దర్శకుడు మోహన్ బాబును హైలైట్ చేసి చూపించాడు. దీంతో సినిమా బోరింగ్‌గా అనిపిస్తుంది. అయితే సినిమాలో ఆయన మాట్లాడే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా. బోరింగ్ ఉన్నా ఫర్లేదు అనుకున్న వారు ఈ సినిమాను ఒక్కసారి చూడవచ్చు.